Krishna Leela Review : కృష్ణ లీల రివ్యూ.. గత జన్మ ప్రేమ కోసం ఈ జన్మ పోరాటం.. కొత్తగా చెప్పడంలో దేవన్ సక్సెస్ అయ్యాడా?

Krishna Leela Review : కృష్ణ లీల రివ్యూ.. గత జన్మ ప్రేమ కోసం ఈ జన్మ పోరాటం.. కొత్తగా చెప్పడంలో దేవన్ సక్సెస్ అయ్యాడా?
x
Highlights

Krishna Leela Review : గత జన్మ ప్రేమను ఈ జన్మలో నెరవేర్చుకోవడానికి హీరో పడే తపన నేపథ్యంలో వచ్చిన చిత్రం కృష్ణ లీల. తిరిగొచ్చిన కాలం అనే ట్యాగ్‌లైన్‌తో దేవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

Krishna Leela Review : గత జన్మ ప్రేమను ఈ జన్మలో నెరవేర్చుకోవడానికి హీరో పడే తపన నేపథ్యంలో వచ్చిన చిత్రం కృష్ణ లీల. తిరిగొచ్చిన కాలం అనే ట్యాగ్‌లైన్‌తో దేవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాబ్లు పృథ్వీ, వినోద్ కుమార్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. గత జన్మ కథలను, పునర్జన్మ నేపథ్యాన్ని చాలా తెలుగు సినిమాల్లో చూశాం. అదే ఫార్ములాతో వచ్చిన ఈ కృష్ణ లీల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ విషయానికి వస్తే

విహారి (దేవన్) అమెరికాలో ప్రముఖ యోగా గురువు. తన చెల్లెలి పెళ్లి నిమిత్తం ఇండియాకు వస్తాడు. ఇక్కడే హోం మంత్రి కూతురు బృంద (ధన్య బాలకృష్ణన్)ను చూస్తాడు. బృందకు అబ్బాయిలంలే కోపం. కాలేజీలో అబ్బాయిలను ఏడిపించడం ఆమెకు సరదా. విహారికి, బృందకు గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలు మెల్లమెల్లగా గుర్తుకొస్తుంటాయి. విహారి ఎన్ని ప్రయత్నాలు చేసినా బృంద ప్రేమను నిరాకరిస్తుంది. ఈ క్రమంలోనే, విహారి తల్లిదండ్రులు (బాబ్లు పృథ్వీ - రజిత) పెళ్లి గురించి బృంద తండ్రి (వినోద్ కుమార్)తో మాట్లాడటానికి వెళ్లగా, ఆయన అవమానించి పంపిస్తారు. విహారి ప్రేమను అంగీకరించని బృంద కారణంగా.. విహారి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, 'హోంమంత్రి కూతురు బృందను నేనే చంపేశాను' అని లొంగిపోతాడు. పోలీసులు విచారించగా, బచ్చన బృంద క్షేమంగా ఉంటుంది. అయితే, విహారి నిజంగా బృందను చంపకపోయినా, ఎందుకు చంపానని చెప్పాడు? గత జన్మలో వారిద్దరూ ఎవరు? బృందకు కూడా గతం గుర్తుకు వచ్చిందా? చివరికి ఆమె విహారి ప్రేమను అంగీకరించిందా? అనేదే ఈ చిత్ర కథ.

విశ్లేషణ

పునర్జన్మల నేపథ్యం తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. జానకి రాముడు, మగధీర వంటి హిట్ ఫార్ములాలనే ఈ కృష్ణ లీల కూడా అనుసరించింది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ పరిచయాలు, హీరో ఆమెను వెతకడం, ప్రేమ కోసం చేసే ప్రయత్నాలు రొటీన్‌గా సాగుతాయి. కాలేజీ సన్నివేశాలు కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తాయి. హీరో రోడ్డు పక్కన ఉన్న హోర్డింగ్‌ను చూసి డైలాగులు చెప్పి, ఇంట్రడక్షన్ సాంగ్ వేసుకోవడం వంటివి అనవసరంగా అనిపిస్తాయి.

మెయిన్ హైలెట్స్ : విహారి పోలీసు స్టేషన్‌కు వెళ్లి 'మంత్రి కూతురిని చంపేశాను' అని చెప్పే సీన్, ఆ తర్వాత 'గత జన్మలో చంపేశాను' అని చెప్పడం కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ప్రేక్షకులలో ఉత్సుకత పెంచుతుంది. ఫ్లాష్‌బ్యాక్ తర్వాత, బృందను ప్రపోజ్ చేయడానికి కోర్టులో పిటిషన్ వేయడం వంటి సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్లు: శివుడు, శివ తత్వం ప్రస్తావనలు ఉన్నప్పటికీ, సినిమాకు కృష్ణ లీల అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. నటీనటులు వేర్వేరు యాసలలో మాట్లాడటం, డైలాగ్ డెలివరీలో స్పష్టత లేకపోవడం మైనస్ అయ్యింది.

నటీనటుల ప్రదర్శన

హీరోగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టిన దేవన్ తన ప్రయత్నంలో నిరాశపరచలేదు. దేవన్ దర్శకత్వంతో పాటు హీరోగా రెండు పాత్రలలో వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించాడు. డైలాగ్ డెలివరీలో కొంచెం తడబడ్డాడు. ధన్య బాలకృష్ణన్ మోడ్రన్ అమ్మాయిగా, గత జన్మలోని పల్లెటూరి అమ్మాయిగా బాగా నటించింది. సీనియర్ నటుడు వినోద్ కుమార్ హోం మంత్రి పాత్రలో మెప్పించారు. బాబ్లు పృథ్వీ, రజిత(తల్లిదండ్రులుగా) తమ పాత్రలకు న్యాయం చేశారు. రజిత కొన్ని చోట్ల అతిగా నటించినట్లు అనిపిస్తుంది. మిగిలిన నటులు పెద్దగా ఆకట్టుకోలేదు.

టెక్నికల్ టీం : సినిమాటోగ్రఫీ, విజువల్స్ అంత బాగాలేవు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. భీమ్స్ సిసిరోలియో పాత పాటలను ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో మొదటి సగంలో చాలా సీన్లను కత్తిరించి ఉండాల్సింది. ఫ్లాష్‌బ్యాక్‌లోని సెట్ కోసం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ బాగా పనిచేసింది. గ్రాఫిక్స్‌పై మరికొంత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

పంచ్ లైన్

పంచ్ లైన్: పునర్జన్మ + కృష్ణ తత్వం = కృష్ణ లీల.

రేటింగ్

రేటింగ్: 2.75/5

Show Full Article
Print Article
Next Story
More Stories