Mirai Review: ఫాంటసీ, యాక్షన్, ఎమోషన్.. తేజ సజ్జా మిరాయ్ రివ్యూ ఇదే..!

Mirai Review : ఫాంటసీ, యాక్షన్, ఎమోషన్.. తేజ సజ్జా మిరాయ్ రివ్యూ ఇదే
x

Mirai Review : ఫాంటసీ, యాక్షన్, ఎమోషన్.. తేజ సజ్జా మిరాయ్ రివ్యూ ఇదే

Highlights

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన తేజ సజ్జా నుండి వచ్చిన తాజా ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో తేజ సజ్జా, మనోజ్ మంచు, రీతికా నాయక్, శ్రియ సరన్, జగపతి బాబు వంటి భారీ తారాగణం నటించారు. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంది? ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం.

Mirai Review: హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన తేజ సజ్జా నుండి వచ్చిన తాజా ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో తేజ సజ్జా, మనోజ్ మంచు, రీతికా నాయక్, శ్రియ సరన్, జగపతి బాబు వంటి భారీ తారాగణం నటించారు. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంది? ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం.

హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్న తేజ సజ్జా, వెంటనే వరుస సినిమాలను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, అతను మిరాయ్ అనే ఒక డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకొని కాస్త గ్యాప్ తీసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ చాలాసార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఒక రోజు ముందుగానే పేయిడ్ ప్రీమియర్లు కూడా ప్రదర్శించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ హీరోగా, మనోజ్ మంచు విలన్ గా నటించారు. రీతికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో మెరిశారు.

మిరాయ్ కథ

ఈ సినిమా తొమ్మిది మహా గ్రంథాల చుట్టూ తిరిగే కథ. ఈ తొమ్మిది గ్రంథాలు ప్రపంచ పటంలో అనేక ప్రదేశాలలో ఉన్నాయి. ప్రతి ప్రదేశంలో, ఆ గ్రంథాలకు రక్షా కవచంగా కొన్ని శక్తులు కలిగిన వ్యక్తులు ఉంటారు. మహావీర్ లామా (మనోజ్ మంచు) ఈ గ్రంథాలను పొందడానికి వారిని తప్పించుకుంటూ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ ఉంటాడు. అయితే, అమరత్వానికి సంబంధించిన తొమ్మిదవ గ్రంథాన్ని పొందడం చాలా కష్టం. ఎందుకంటే, ఆ తొమ్మిదవ గ్రంథానికి రక్షా కవచంగా ఉన్న అంబిక (శ్రియ సరన్), మహావీర్ లామా నుండి ముప్పును ముందుగానే పసిగట్టి, అతనిని ఎదుర్కోవడానికి తన కుమారుడు వేద (తేజ సజ్జా)ను ఒక ఆయుధంగా పెంచుతుంది. చిన్నతనంలోనే తనకు దూరమైన వేద, తాను అంబిక కొడుకు అని ఎప్పుడు తెలుసుకున్నాడు? లామాను ఎదుర్కోవడానికే తాను పుట్టానని ఆమెకు ఎలా తెలిసింది? ఇది తెలుసుకున్న తర్వాత వేద ఎలా సూపర్ యోధుడిగా మారాడు? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఇటీవలి కాలంలో భక్తి, పౌరాణిక అంశాలతో కూడిన సినిమాలు బాగా ఆడుతున్నారు. తేజ హనుమాన్ సినిమా కంటే ముందే మొదలైందని చెబుతున్నారు. ఈ సినిమా కథ కూడా దాదాపుగా భక్తి, పౌరాణిక అంశాలతో నిండి ఉంది. కథలో చెప్పినట్లుగా 9 మహా గ్రంథాలను పొందడానికి మహావీర్ లామా ప్రారంభించిన యుద్ధాన్ని ఆపడానికి తేజ ఎలా వేద నుండి యోధుడిగా మారాడు అనేది సినిమా కథ. అయితే, దర్శకుడు తేజ కోసం యూత్ ను ఆకట్టుకునే విధంగా కొన్ని ఆసక్తికరమైన పోరాటాలు, అలాగే కామెడీ సన్నివేశాలను రాశాడు. అవన్నీ బాగానే ఉన్నాయి.

సినిమాలో మనోజ్ మంచు పాత్ర పరిచయం అయిన తర్వాత ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. మనోజ్ ఎంట్రీ తర్వాత, సినిమాపై ఆసక్తిని పెంచడానికి యాక్షన్ బ్లాక్ లేదా ఆసక్తికరమైన ట్విస్ట్‌ను ఇస్తాడు. అయితే, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొద్దిగా నెమ్మదిగా అనిపించినప్పటికీ, తేజ మిరాయ్ శక్తులను పొందిన తర్వాత చేసే పోరాటాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శకుడిగానే కాకుండా, సినిమాటోగ్రాఫర్‌గా కూడా కార్తీక్ ఘట్టమనేని తన ముద్ర వేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ రెండు బాధ్యతల కంటే స్క్రీన్‌ప్లేతోనే అతను ఎక్కువగా ఆకట్టుకున్నాడు. కళింగ యుద్ధం తర్వాత 9 గ్రంథాల గురించి అశోక చక్రవర్తి తీసుకున్న నిర్ణయాలు, మొదటి హాఫ్‌లోని ఆ రక్షకుల పాయింట్‌ను కార్తీక్ ఘట్టమనేని దాటవేశారు. తర్వాత, దానిని స్థాపించడానికి ఏర్పాటు చేసిన విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫామెన్స్

హనుమాన్ తర్వాత తేజ మళ్ళీ మిరాయ్‎లో రెండు విభిన్న పార్శ్వాలున్న పాత్రలో మెరిశాడు. సాధారణంగా శక్తులు వచ్చిన తర్వాత దర్శకులు కొన్ని అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను పెడతారు. కానీ, ఈ సినిమాలో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఒక విధంగా తేజ నటనలో చాలా పరిణతి కనిపించింది. మనోజ్ మంచు స్క్రీన్ టైమ్ తక్కువైనప్పటికీ అతను తెరపై కనిపించిన ప్రతిసారీ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాడు. మనోజ్ లుక్, స్టైల్ ఆకట్టుకున్నాయి. మనోజ్ నటన కూడా ఆకట్టుకుంది. శ్రీయాకు చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర లభించింది. రితికా నాయక్ పాత్ర హీరోయిన్‌గా మాత్రమే పరిమితం అయింది. జగపతి బాబు, జయరామ్ వంటి నటులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

టెక్నికల్ వ్యాల్యూస్

ఈ సినిమా థియేటర్లలో ఒక మంచి విజువల్ ఫీస్ట్. ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. కథ, కథనం ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, మ్యూజిక్ కూడా చాలా చక్కగా కుదిరింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా చేశారు. అయితే, నిడివి విషయంలో మరికొంత శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.

చివరిగా, మిరాయ్ థియేటర్లలోనే చూడాల్సిన సినిమా

రేటింగ్ : 3.5/5

Show Full Article
Print Article
Next Story
More Stories