మంచు మనోజ్‌ ట్వీట్ వైరల్: ‘కన్నప్ప’ ఊహించని విజయం.. ప్రభాస్ ఎంట్రీ, విష్ణు నటనపై అద్భుత కామెంట్స్!

మంచు మనోజ్‌ ట్వీట్ వైరల్: ‘కన్నప్ప’ ఊహించని విజయం.. ప్రభాస్ ఎంట్రీ, విష్ణు నటనపై అద్భుత కామెంట్స్!
x

మంచు మనోజ్‌ ట్వీట్ వైరల్: ‘కన్నప్ప’ ఊహించని విజయం.. ప్రభాస్ ఎంట్రీ, విష్ణు నటనపై అద్భుత కామెంట్స్!

Highlights

‘కన్నప్ప’ సినిమాపై మంచు మనోజ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్ స్పెషల్ ఎంట్రీ, మంచు విష్ణు నటన, క్లైమాక్స్ హైలైట్‌గా నిలిచినట్టు తెలిపారు. IMAX‌లో సినిమా చూసిన తర్వాత మళ్లీ రేపు వస్తానన్నారు.

‘కన్నప్ప‌’ సినిమాపై మంచు మనోజ్ ఇచ్చిన సమీక్ష ఒక్కసారిగా వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఉన్న మనస్పర్థలు తెలిసిందే. అయినప్పటికీ, అన్న సినిమా చూసి ప్రశంసించడం వారిద్దరి మధ్య సంబంధాల్లో పాజిటివ్ టర్న్‌గా అభిమానులు భావిస్తున్నారు. "ఇప్పటికైనా అన్నదమ్ముల మధ్య అనురాగం పునరుద్ధరమవుతుందా?" అనే చర్చ సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తోంది.

‘కన్నప్ప’కు ప్రశంసల జల్లు

సినిమా చూస్తూనే ఎమోషనల్ అయిన మంచు మనోజ్.. "ఇది ఓ విజువల్ ఫెస్టివల్. మొదటి ఐదు నిమిషాలు మిస్ అయ్యాను. రేపు మళ్లీ చూస్తా" అన్న వ్యాఖ్యలు అభిమానుల మనసు గెలుచుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ క్యామియో (Prabhas Cameo) సినిమాకు కీలక మలుపునిచ్చిందని పేర్కొన్నారు.

ప్రభాస్ ఎంట్రీతో కుదిపేసిన సినిమా

కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్ర చిన్నదైనా, అది సినిమాకే బలాన్ని ఇచ్చిందని ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్. "వీడియో గేమ్ లెవల్ గ్రాఫిక్స్, భక్తి, యాక్షన్ కలయిక.. ఈ సినిమా నిజంగా వంద శాతం విజయం దిశగా వెళుతోంది" అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫ్యామిలీ డ్రామా నుంచి సిల్వర్ స్క్రీన్ సక్సెస్ వరకు

ఈ సినిమా కేవలం మైథాలజికల్ డ్రామా మాత్రమే కాదు. ఇది మంచు విష్ణు వ్యక్తిగత ప్రయాణంలో ఒక కీలక మలుపు కూడా. డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘కన్నప్ప’ సినిమా.. ఆయన కెరీర్‌ను తిరగరాస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా హైలైట్స్:

  • ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ హైలైట్
  • ప్రభాస్ క్యామియో సర్ప్రైజ్
  • మోహన్‌బాబు, మోహన్‌లాల్ నటన ఆకట్టుకొన్నాయి
  • గ్రాఫిక్స్, విజువల్ ప్రెజెంటేషన్ ప్రశంసలు పొందుతున్నాయి
  • తెలుగు భక్తి సినిమాల్లో ‘కన్నప్ప’ ఒక మైలురాయి
Show Full Article
Print Article
Next Story
More Stories