Pelli Kaani Prasad Movie Review: పెళ్లయ్యాక.. 'పెళ్లి కాని ప్రసాద్‌' పడ్డ కష్టాలు. మూవీ ఎలా ఉందంటే..?

Pelli Kaani Prasad Movie Review: పెళ్లయ్యాక.. పెళ్లి కాని ప్రసాద్‌ పడ్డ కష్టాలు. మూవీ ఎలా ఉందంటే..?
x
Highlights

Pelli Kaani Prasad Movie Review: సప్తగిరి హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్‌. అభిలాష్‌ రెడ్డి గోపిడి దర్శకత్వంలో సప్తగిరి, ప్రియాంకా శర్మ జోడీగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pelli Kaani Prasad Movie Review: సప్తగిరి హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్‌. అభిలాష్‌ రెడ్డి గోపిడి దర్శకత్వంలో సప్తగిరి, ప్రియాంకా శర్మ జోడీగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది.? ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి.? లాంటి వివరాలు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి

నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల

బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్

సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్

విడుదల: SVC

డిఓపి: సుజాత సిద్దార్థ్

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటర్: మధు

సినిమా కథేంటంటే:

ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఓ స్టార్ హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతడి తండ్రి (మురళీధర్) ఒకసారి వారి కుటుంబ కట్నం చరిత్రను వివరిస్తూ, 2 కోట్లకు తక్కువ కట్నం వస్తే పెళ్లి చేసుకోకూడదని చెబుతాడు. ఈ మాటలను బలంగా నమ్మిన ప్రసాద్‌, అలాంటి సంబంధమే కావాలని చూస్తుంటాడు. అయితే ప్రసాద్‌కు అదే ఊరిలో ఉండే ప్రియ (ప్రియాంక శర్మ) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి విదేశాల్లో స్థిరపడాలన్న కలలతో జీవిస్తుంది.

ఈ క్రమంలో ప్రసాద్ గురించి తెలుసుకున్న ప్రియ, తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో అతన్ని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత సొంతూరిలోనే స్థిరపడాలనే ఆలోచనతో ఉంటాడు ప్రసాద్‌. ఈ విషయమై వీరిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అసలు ప్రసాద్‌ విదేశాలకు తిరిగి ఎందుకు వెళ్లకూడదని అనుకుంటాడు. పెళ్లి కాని ప్రసాద్‌ జీవితం పెళ్లి అయ్యాక ఎలా మారింది.? చివరికి ప్రసాద్‌ ఫారిన్‌లో సెటిల్‌ అవుతాడా, ఇండియాలోనే ఉంటాడా.? లాంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా నటించారు.?

సినిమా మొత్తాన్ని సప్తగిగి ఒంటి చేత్తో నడిపించాడని చెప్పాలి. ఓవైపు పెళ్లి చేసుకోలేక ఒత్తిడిలో ఉన్న యువకుడిగా, మరోవైపు ప్రేమలో మోసపోయిన వ్యక్తిగా తన భావోద్వేగాలను బాగా ప్రదర్శించాడు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర మురళీధర్ గౌడ్‌ది. తన అనుభవంతో, నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా పాత్రల ట్రాక్ ఆకట్టుకునేలా సాగింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి.

ఇక టెక్నికల్‌ పరంగా చూస్తే.. శేఖర్ చంద్ర సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ సినిమాకి బలాన్నిచ్చాయి. మీమ్‌లను సన్నివేశాల్లో చూపించిన విధానం బాగుంది. పాటల చిత్రీకరణ బాగుంది. ఇక కొన్ని డైలాగ్స్‌ నవ్వించడమే కాకుండా, ఆలోచింపజేసేలా ఉన్నాయి.

విశ్లేషణ:

తెలుగులో పెళ్లి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటి ఒక సింపుల్‌ లైన్‌తో తీసుకున్న కథనే. పెళ్లికావడం లేదని బాధపడే యువకుడు, విదేశాలకు వెళ్లాలని ఆశ పడే యువతి ఇలా ఇద్దరి జీవితాలు కలిస్తే, ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న పాయింట్‌తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కథలో పెద్దగా కొత్తదనం లేదనిపించినా.. దర్శకుడు సినిమా బోరింగ్ లేకుండా తెరకెక్కించాడు. ముఖ్యంగా హాస్యానికి పెద్ద పీట వేశాడు. మొత్తం మీద ఈ హాట్‌ సమ్మర్‌లో కూల్‌గా సినిమా చూసేయొచ్చు.

రేటింగ్ 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories