Vakeel Saab Review: వకీల్ సాబ్ రివ్యూ

Power Star Pawan Kalyans Vakeel Saab Review
x

వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్, నివేదా థామస్, అంజలి, అనన్య

Highlights

Vakeel Saab Review: దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత 'వకీల్ సాబ్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్.

Vakeel Saab Review: దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత 'వకీల్ సాబ్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' సినిమా తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ ఈ రోజు రిలీజ్ అయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తెలిసిన కథే అయినా... డైరెక్టర్ వేణు పవన్ ను ఎలా చూపించాడోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ పై చాలా అంచనాలు ఏర్పాడ్డాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవన్ 'వకీల్ సాబ్'... ఎంత మేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

Vakeel Saab Story

వేముల పల్లవి (నివేదితా థామస్), దివ్య (అనన్య), జరీనా(అంజలి) ముగ్గురు మంచి స్నేహితులు. జాబ్ చేసే వీళ్లు.. హైదరాబాద్ లో ఒక ప్లాట్ అద్దెకు తీసుకుంటారు. ఓ రోజు రాత్రి ఇంటికి వెళ్తూ క్యాబ్ బుక్ చేసుకుంటారు. అది దారి మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోతుంది. దీంతో వాళ్లు ఆ రాత్రి పూట లిప్ట్ కోసం ట్రై చేస్తుంటారు. అలాంటి సమయంలో ఓ ఎంపీ కొడుకు (వంశీ కృష్ణ) అటుగా కారులో వెళ్తాడు. ఆ కారులో పల్లవి క్లాస్ మేట్ అయిన మరో వ్యక్తి కూడా ఉంటాడు. దీంతో వారు దురుద్దేశ్యంతోనే కారు ఆపి ఈ ముగ్గురికి లిప్ట్ ఇస్తారు. డిన్నర్ చేసి వెళ్దామని నచ్చజెప్పి రిసార్ట్ కి తీసుకెళ్తారు. అక్కడ వీళ్లు లైంగికంగా లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో పల్లవి ఎంపీ కొడుకుని కొట్టి, అక్కడ నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలు తప్పించుకుంటారు. ఎంపీ కొడుపై పోలీసు స్టేషన్‌లో కేసు పెడతారు.


మరోవైపు ఎంపీ కొడుకు తన పలుబడితో ఆ ముగ్గురు అమ్మాయిలపై రివర్స్ కేసు పెడతాడు. పల్లవిని జైలులో పెట్టించి, బెయిల్ రాకుండా చూస్తాడు. ఇలాంటి స్థితిలో వారి కాలనీకి వచ్చిన వకీల్ సాబ్ కె సత్యదేవ్(పవన్ కళ్యాణ్) గురించి తెలుస్తుంది. సత్యదేవ్ కేసును స్వీకరించి కోర్టులో వంశీ బ్యాచ్‌తో పోరాడుతాడు. ముగ్గురు మహిళలకు తగిన న్యాయం జరిగేలా సత్యదేవ్ ఏం చేశాడు? ఈ ప్రక్రియలో అతను ఎదురుకున్న సవాళ్లు ఏమిటి? ఈ సినిమా ద్వారా అందించిన సందేశం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ..

పవన్ కళ్యాణ్ తన ట్రేడ్ మార్క్ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ సినిమాను తనదైన శైలిలో పండించడంలో సక్సెస్ అయ్యారు. అభిమానులు కోరుకున్న అంశాలన్నీ ఆయనలో చూపించాడు ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు.సినిమా ప్రారంభమైన పావు గంటకు పవన్ ఎంట్రీ ఇస్తాడు. పవన్ ఇంట్రడక్షన్ సీన్ ను ఓ రేంజిలో చూపించారు. పవన్ కళ్యాణ్ ని ఓ తాగుబోతు లాయిర్ గా, అన్యాయానికి ఎదురు తిరిగే వ్యక్తిగా చూపెడుతూ ఫస్టాఫ్ లాగించారు. ఫస్టాప్ లో స్లో నెరేషన్ కొంత ఇబ్బంది పెడుతుంది. సో ఫస్టాప్ యావరేజ్ గా నిలిచింది.

ఇక ఇంట్రవెల్ కు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పల్లవి కేసును తీసుకుంటాడు. సెకండాఫ్ లో కోర్ట్ సీన్ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో పవన్ డైలాగులు ప్రత్యేకంగా రాశారు. మూలం చెడిపోకుండా కొత్తగా ట్రై చేశారు. వాటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఫైట్స్ కూడా కథలో భాగంగా చూపించారు. బాలీవుడ్ సినిమా 'పింక్' సినిమాను తమిళంలో 'నేర్కొండ పార్వాయ్' టైటిల్ తో రీమేక్ చేశారు. హిందీలో అమితాబ్ పాత్రని, తమిళంలో అజిత్, తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించారు.

'పింక్' లో అమితాబ్ బచ్చన్ వృద్ధుడిగా కనిపిస్తాడు. కాగా, తమిళంలో మధ్య వయస్కుడిగా అజిత్ కనిపించాడు. ఇక తెలుగులో మాత్రం, పవన్ కళ్యాణ్ యంగ్ లుక్ తోనే కనిపిస్తారు. హిందీ, తమిళ్ కంటే కూడా తెలుగులో హీరో పాత్రని బాగా ఎలివేట్ చేశారు. అలాగే తెలుగు వెర్షన్ పాటలు విషయానికొచ్చినప్పుడు పాటలు ఎక్కువగానే వున్నాయి. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే క్రాక్ లో చూపించిన ఈజ్ ను రీక్రియేట్ చేయలేకపోయింది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే సినిమాకు కీలకంగా నిలిచారు. ఆయన లేకపోతే ఇంకెవరూ అంత గొప్పగా చేయలేరనిపించింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా వారి పాత్రలను చాలా బాగా చేశారు.

దర్శకుడుగా వేణు శ్రీరామ్ సక్సెస్ అ్యయాడనే చెప్పాలి. పింక్ లాంటి మల్టిప్లెక్స్ సినిమాని మాస్ సినిమాగా మార్చి మెప్పించాడు. సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ని చెడగొట్టకుండా ప్రెజెంట్ చేశారు. కోర్ట్ రూమ్ డ్రామాను ఏమాత్రం బోర్ కొట్టించకుండా లాగించాడు. అయితే పింక్ తో పోల్చితే.. కమర్షియల్ ఎలిమెంట్స్ కొద్దిగా ఎక్కువ అయ్యాయనే ఫీల్ వస్తుంది.


ఇక ఈ సినిమాకు పెద్ద ఎసెట్ తమన్ మ్యూజిక్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా అయ్యాక కూడా మన చెవుల్లో వినిపిస్తుంది. పియస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఫస్టాఫ్ లో స్లో నెరేషన్ ను మరింత ట్రిమ్ చేయాల్సింది. అనవసర డైలాగ్స్ ను తొలగిస్తే సినిమా రన్‌టైమ్ కాస్త తగ్గి, మరింత క్రిష్పీగా ఉండేది. డైలాగులు బాగున్నాయి. మొత్తానికి వకీల్ సాబ్ ఓ ఎమోషనల్ సామాజిక కథాంశంగా ఆకట్టుకోవడంలో విజయవంతం అయింది. ప్రతీ ఒక్కరు సినిమాను హ్యాపీగా చూడొచ్చు.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే!

Show Full Article
Print Article
Next Story
More Stories