Veera Simha Reddy: 'వీర సింహారెడ్డి' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Veera Simha Reddy Movie Review
x

Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Highlights

Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?

చిత్రం: వీర సింహా రెడ్డి

నటీనటులు: నందమూరి బాలకృష్ణ శృతిహాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్, లాల్, నవీన్ చంద్ర, రవి శంకర్, అజయ్ ఘోష్, మురళి శర్మ, సప్తగిరి తదితరులు

సంగీతం: ఎస్ ఎస్ తమన్

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబ్

నిర్మాత: నవీన్ యెర్నేని, వై రవి శంకర్

దర్శకత్వం: గోపీచంద్ మలినేని

బ్యానర్లు: మైత్రి మూవీ మేకర్స్

విడుదల తేది: 12/01/2023

ఈ మధ్యనే "అఖండ" సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు "వీర సింహా రెడ్డి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "క్రాక్" సినిమా తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించారు. చాలాకాలం తర్వాత బాలకృష్ణ ఈ సినిమాలో ఒక ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ముందు నుంచే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ అనగా జనవరి 12, 2023న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ:

వీర సింహా రెడ్డి (బాలకృష్ణ) రాయలసీమ లోని పులిచెర్ల అనే ప్రాంతానికి లీడర్. అతని కొడుకు (జయ సింహా రెడ్డి) బాలకృష్ణ ఇస్తాన్ బుల్ లో ఉంటాడు. వీర సింహారెడ్డి చెల్లెలు భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) పులి చర్లలోనే వీర సింహారెడ్డికి వ్యతిరేకంగా మరొక ఫ్యాక్షన్ గ్రూప్ నడిపిస్తూ ఉంటుంది. అసలు "వీర సింహా రెడ్డి" మరియు అతని చెల్లెలికి ఎందుకు గొడవలు వచ్చాయి? ఇప్పుడు తన చెల్లెలితో వీరసింహారెడ్డి గెలవగలడా లేదా? జై సింహా రెడ్డి తన తండ్రికి సహాయం చేశాడా? అసలు చివరికి ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

రెండు విభిన్న పాత్రలు అయినప్పటికీ నందమూరి బాలకృష్ణ ఆ రెండు పాత్రలని చాలా బాగా పోట్రే చేశారు. ముఖ్యంగా మాస్ సన్నివేశాలలో బాలకృష్ణ పర్ఫామెన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. బాలకృష్ణ అంతే బాగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఆ పాత్రను ఏమాత్రం వేస్ట్ చేయకుండా వరలక్ష్మి చాలా బాగా నటించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. శృతిహాసన్ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కానీ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. బాలయ్యతో శృతిహాసన్ రొమాన్స్ పర్వాలేదు అనిపిస్తుంది. హాని రోజ్ కూడా తన అందం మరియు నటనతో మంచి మార్కులు వేయించుకుంది. దునియా విజయ్ ఈ సినిమాకి మెయిన్ విలన్ గా బాగానే నటించారు. మురళీ శర్మ కి పెద్ద పాత్ర కాకపోయినాప్పటికీ బాగానే నటించారు. మిగతా నటీనటులు కూడా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

స్క్రిప్ట్ మొదట్లో కొంత స్లోగా వెళ్ళినప్పటికీ యంగ్ బాలకృష్ణ మరియు శృతిహాసన్ల ఎపిసోడ్ వచ్చేసరికి తన నేరేషన్ కూడా స్పీడ్ అందుకుంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ని బాగానే చూపించారు. ఇక వీర సింహారెడ్డి పాత్ర ఎంటర్ అవ్వడంతో సినిమా మొత్తం యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బాలయ్య చెప్పే పొలిటికల్ పవర్ ఫుల్ డైలాగ్లు అతని గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఇవన్నీ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. ఎస్ ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఒకటి రెండు పాటలు కూడా బాగానే అనిపించాయి. సాయి మాధవ్ బుర్ర రచించిన డైలాగులు సినిమాకి అతిపెద్ద హైలైట్. మాస్ సన్నివేశాల్లో మాత్రమే పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్ లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో హార్ట్ టచింగ్ డైలాగ్స్ సాయి మాధవ్ బుర్ర చాలా చక్కగా రాశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్లలో సినిమాటోగ్రఫీ బాగుంది.

బలాలు:

బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ మరియు పర్ఫామెన్స్

ఫస్ట్ హాఫ్

పొలిటికల్ డైలాగ్స్

మాస్ సాంగ్స్

బలహీనతలు:

సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్

ఎమోషనల్ డ్రామా

ప్రేడిక్టబుల్ కథ

రొటీన్ ఫైట్ సన్నివేశాలు

చివరి మాట:

"వీర సింహా రెడ్డి" సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. చాలావరకు కామెడీ సన్నివేశాలు మరియు లవ్ ట్రాక్ తో సినిమా చాలా సరదా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా వచ్చింది. ఇక వీర సింహా రెడ్డి ఎంట్రీ తర్వాత కథ మొత్తం మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా మారుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టిస్తాయి. ఫస్టాఫ్ చాలా ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లోగా గడుస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ లో అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చూస్తే "వీర సింహా రెడ్డి" సినిమా ఒక సింపుల్ కథతో రాసుకున్న పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా.

బాటమ్ లైన్:

కేవలం బాలయ్య అభిమానులకు మరియు ఫ్యాక్షన్ లవర్స్ కు మాత్రమే నచ్చే "వీర సింహా రెడ్డి".

Show Full Article
Print Article
Next Story
More Stories