Vinaro Bhagyamu Vishnu Katha Review: వినరో భాగ్యము విష్ణు కథ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Vinaro Bhagyamu Vishnu Katha Movie Review
x

Vinaro Bhagyamu Vishnu Katha Review: వినరో భాగ్యము విష్ణు కథ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Vinaro Bhagyamu Vishnu Katha Review: వినరో భాగ్యము విష్ణు కథ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ

నటీనటులు: కిరణ్ అబ్బవరం, కష్మీరా, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, ఆమని, ప్రవీణ్, ఎల్ బి శ్రీరామ్ తదితరులు

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: డేనియల్ విశ్వాస్

నిర్మాత: బన్నీ వాస్

దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు

బ్యానర్: జీ ఏ 2 పిక్చర్స్

విడుదల తేది: 18/02/2023

ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రతి సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఖరియర్లో బాగానే ముందుకు దూసుకుపోతున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. 2022లో ఏకంగా మూడు సినిమాలు విడుదల చేసిన ఈ హీరో తాజాగా ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేసాడు. మురళీ కిషోర్ అబ్బూరు అనే ఒక కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ జిఏ 2 పిక్చర్స్ నిర్మించింది. కాశ్మీరా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్లతోనే ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఇవాళ అనగా ఫిబ్రవరి 18, 2023 న ఈ సినిమా థియేటర్ల లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

విష్ణు కిరణ్ అబ్బవరం తిరుపతిలో ఒక లైబ్రేరియన్ గా పనిచేస్తూ ఉంటాడు తన తల్లిదండ్రులు తన చిన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో విష్ణు తన తాత వద్ద పెరుగుతాడు. పక్క వాళ్లకి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే విష్ణుకి ఒక రోజు ఒక ఫోన్ కాల్ వస్తుంది. యూట్యూబర్ దర్శన (కష్మీరా) తన ఫోన్ నెంబర్ కి దగ్గరగా ఉన్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి విష్ణు మరియు శర్మ (మురళి శర్మ) తో స్నేహం మొదలు పెడుతుంది. ఇక్కడి నుంచి ఈ కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ దర్శన ఎవరు? ఆమె వల్ల విష్ణు జీవితం ఎలాంటి మరుపులు తిరిగింది? చివరికి ఏమైంది? తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం చాలా బాగా నటించాడు అని చెప్పుకోవాలి. ఒకవైపు యాక్షన్స్ సన్నివేశాల్లో మాత్రమే కాక మరోవైపు కామెడీ సన్నివేశాల్లో కూడా చాలా బాగా నటించినా కిరణ్ అబ్బవరం తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. కష్మీర పరదేశి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. కేవలం తన అందంతో మాత్రమే కాక నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకుంది. మురళీ శర్మ నటన ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ మురళి శర్మ ఆ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు. శుభలేఖ సుధాకర్ కూడా తన పాత్రలో బాగానే నటించారు. ప్రవీణ్ కామెడీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఆమని, ఎల్ బి శ్రీరామ్, తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు ఈ సినిమా కోసం మంచి కథను రాసుకున్నారు. ప్రేక్షకులకు ఏమాత్రం బోరు కొట్టించకుండా స్క్రీన్ ప్లే చాలా టైట్ గా రాసుకున్నారు. అలాంటి ఆసక్తికరమైన కథని తెరకెక్కించడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవాలి. ప్రతి 10 నిమిషాలకి కథని మలుపులు తిప్పుతూ డైరెక్టర్ ప్రేక్షకులను సినిమా ఆద్యంతం కట్టిపడేసారు. ఒకవైపు క్రైమ్ తో పాటు మరోవైపు కామెడీ కి కూడా పెద్దపీట వేస్తూ డైరెక్టర్ కాదని ముందుకు తీసుకువెళ్లిన విధానం చాలా బాగుంది. జీ ఏ 2 పిక్చర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తన నేపథ్య సంగీతంతో సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని బాగా ఎలివేట్ చేశాడు. డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే అనిపిస్తుంది.

బలాలు:

కథ

స్క్రీన్ ప్లే

కామెడీ

కథలో ఉన్న కొత్తదనం

నేపథ్య సంగీతం

బలహీనతలు:

కొన్ని ట్విస్టులు

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ముఖ్య పాత్రల ఇంట్రడక్షన్ మరియు కథ ఎస్టాబ్లిష్ చేయడంతోనే సరిపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మురళీ శర్మ, కిరణ్, కష్మీర ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఎంటర్టైన్మెంట్ తో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సరదా సరదాగా సాగిపోతుంది. మురళి శర్మ మరియు కష్మీర ల మధ్య ట్రాక్ కూడా అంత ఓవర్ గా అనిపించలేదు. ఇక ఇంటర్వల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా ఎవరు ఊహించినటువంటి విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొదట్లో కొన్ని సన్నివేశాలు మరియు పాట అవసరం లేకపోయినా కూడా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ పోర్షన్లు మాత్రం చాలా బాగా చిత్రీకరించించారు. మంచి ట్విస్ట్ లతో సీక్వెల్ కి కూడా హింట్ ఇస్తూ సినిమాని బాగా ఎండ్ చేశారు. ఓవరాల్ గా ఒక విభిన్న కథతో ప్రేక్షకులను సినిమా మొత్తం ఎంగేజ్ చేశారు డైరెక్టర్.

బాటమ్ లైన్:

మంచి ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది "వినరో భాగ్యము విష్ణు కథ".

Show Full Article
Print Article
Next Story
More Stories