Flight crash: కుప్ప‌కూలిన విమానంలో చిరంజీవి, బాల‌కృష్ణ‌.. ఇంత‌కీ ఆ రోజు ఏం జ‌రిగిందంటే

Flight crash
x

Flight crash: కుప్ప‌కూలిన విమానంలో చిరంజీవి, బాల‌కృష్ణ‌.. ఇంత‌కీ ఆ రోజు ఏం జ‌రిగిందంటే

Highlights

Flight Crash: ఈ ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, విజయశాంతి, అల్లు రామలింగయ్య వంటి స్టార్ సెలబ్రిటీలు ఉన్నారు. అలాగే కమెడియన్ సుధాకర్, డైరెక్టర్లు బాపు, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణ రావు, రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్ సుచిత్ర, ఫైట్ మాస్టర్ సుబ్బరాయన్, ఫొటోగ్రాఫర్ అనుమోలు హరి, చిరంజీవి మేకప్ మ్యాన్ శివ తదితరులు ఉన్నారు.

Flight crash: అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఎయిరిండియా విమాన ప్ర‌మాదం ఎంత‌టి విషాదాన్ని మిగిల్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ప్ర‌మాదంలో ఏకంగా 240కి పైగా ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. భారత వైమానిక చరిత్రలో మరిచిపోలేని సంఘటనగా నిలిచిపోయింది.

కానీ, ఓ సందర్భంలో ఇంధనం లేకపోయినా, టెక్నికల్ ఫెయిల్యూర్ ఎదురైనా.. పైలట్ల చాకచక్యంతో ఒక విమానం క్షేమంగా ల్యాండ్ కావడం విశేషం. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఇంత‌కీ సంఘ‌ట‌న ఎప్పుడు జ‌రిగింది.? ప్ర‌మాదం నుంచి ఎలా బ‌య‌టప‌డ్డారు.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1993 నవంబర్ 15న, మద్రాసు (ఇప్పటి చెన్నై) నుంచి హైదరాబాద్‌కి వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్ 440 విమానం టేకాఫ్ అయ్యింది. కానీ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో తీవ్ర పొగమంచు కారణంగా రన్‌వే స్పష్టంగా కనిపించలేదు. పైలట్ కెప్టెన్ రామ్ పీ భల్లా, కో పైలట్ వల్ రాజ్ తిరిగి మద్రాసుకు వెళ్లాలని నిర్ణయించారు. కానీ ఆ సమయంలో విమానంలో ఇంధనం తక్కువగా ఉండటంతో రిట‌ర్న్ వెళ్ల‌లేని ప‌రిస్థితి.

ఇంధ‌నం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో తిరుపతి సమీపంలోని గుండపల్లె గ్రామానికి చేరేసరికి, విమానం పూర్తిగా ఇంధనాన్ని కోల్పోయింది. దీంతో అక్కడి పొలాల్లో అత్యంత జాగ్రత్తగా బెల్లీ ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు పైలట్లు చూపిన ధైర్యం అప్ప‌ట్లో ఓ వండ‌ర్‌. అప్పుడు విమానంలో 272 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి.

ఆ సమయంలో గ్రామ సర్పంచ్‌గా ఉన్న దేశిరెడ్డి (ఇప్పుడు వయసు 80) మాటల్లో – “ఒక భారీ శబ్దం విన్నాము. వెంటనే మా గ్రామస్తులంతా అక్కడికి పరుగెత్తాం. పోలీసులు చేరేసరికి, ప్యాసింజర్లను సహాయంగా బయటకు తీసుకురాగలిగాం,” అని గుర్తు చేసుకున్నారు. విమానంలో టాప్ సెలబ్రిటీలు ఉన్నారు అనే విషయం తెలియగానే అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా అక్కడికి వచ్చారు.

ఈ ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, విజయశాంతి, అల్లు రామలింగయ్య వంటి స్టార్ సెలబ్రిటీలు ఉన్నారు. అలాగే కమెడియన్ సుధాకర్, డైరెక్టర్లు బాపు, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణ రావు, రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్ సుచిత్ర, ఫైట్ మాస్టర్ సుబ్బరాయన్, ఫొటోగ్రాఫర్ అనుమోలు హరి, చిరంజీవి మేకప్ మ్యాన్ శివ తదితరులు ఉన్నారు.

ప్రమాదం నుంచి బయటపడిన అనంతరం గ్రామస్థులకు కృతజ్ఞతగా, సెలబ్రిటీలు “మీకు కావలసింది ఏమైనా చెప్పండి” అని అడిగారు. దానికి గ్రామస్థులు “ఊరికి ఆసుపత్రి కావాలి” అని కోరారు. అయితే ఇది ఆ సమయంలో వాగ్దానంగానే మిగిలిపోయింది. తర్వాత ఆ స్పష్టమైన హామీ అమలవలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories