2018 Movie: దుమ్ము రేపుతున్న 2018 కలెక్షన్స్, జాక్ పాట్ కొట్టిన బన్నివాసు

2018 Movie: దుమ్ము రేపుతున్న 2018 కలెక్షన్స్, జాక్ పాట్ కొట్టిన బన్నివాసు
x

2018 Movie: దుమ్ము రేపుతున్న 2018 కలెక్షన్స్, జాక్ పాట్ కొట్టిన బన్నివాసు

Highlights

కంటెంట్ కొత్తగా ఉంటే చాలు..అది మన భాష చిత్రమా..లేక పర భాష చిత్రమా అని తేడాలు చూపకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. బిచ్చగాడు సినిమాతో ఆ విషయాన్ని ఎప్పుడో రుజువు చేసుకున్న టాలీవుడ్ ఆడియెన్స్ మళ్లీ ఇప్పుడు 2018 చిత్రంతో మరోసారి కన్ ఫామ్ చేశారు.

2018 Movie: కంటెంట్ కొత్తగా ఉంటే చాలు..అది మన భాష చిత్రమా..లేక పర భాష చిత్రమా అని తేడాలు చూపకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. బిచ్చగాడు సినిమాతో ఆ విషయాన్ని ఎప్పుడో రుజువు చేసుకున్న టాలీవుడ్ ఆడియెన్స్ మళ్లీ ఇప్పుడు 2018 చిత్రంతో మరోసారి కన్ ఫామ్ చేశారు. గత వారం మలయాళం డబ్బింగ్ మూవీగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన 2018 తుఫాన్ లాంటి కలెక్షన్స్ తో దుమారం రేపుతోంది.

కేరళలో ఐదేళ్ల కిందట వచ్చిన వరదలను ఆధారంగా చేసుకొని మలయాళ దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ 2018 చిత్రాన్ని తెరకెక్కించారు. టొవినో థామస్, కుంజుకో బొబన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని స్ట్రైట్ సినిమాలను మించి వసూళ్లు రాబడుతోంది.

కంటెంట్ లో దమ్ముంటే కటౌట్ తో పని లేదు అనే విషయాన్ని రుజువు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. మలయాళంలో రూ.200 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయం కాగా తెలుగులో కూడా తన సత్తా చాటుకుంటోంది. రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ ముందుకొచ్చిన 2018 తొలి రోజే రూ.60 లక్షల షేర్ రాబట్టింది. ఇప్పటివరకు అంటే రిలీజైన 8 రోజుల్లో రూ.8.21 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అలా తొలి వారంలోనే నిర్మాత బన్ని వాసుకి లాభాలు తెచ్చిపెట్టింది.

2018 సినిమాలో స్టార్స్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్లంతా ముఖ్యమైన పాత్రధారులుగా మాత్రమే ఈ కథలో కనిపిస్తారు. సినిమాలో ముప్పావు వంతు వానలో..వరదలో నడుస్తుంది. తుపాను వాతావరణం తీసుకొని రావడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎమోషన్స్ కనెక్ట్ కావడం 2018 సక్సెస్ కి కారణమని చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories