23 Movie: ఓటీటీలోకి మల్లేశం డైరెక్టర్ లేటెస్ట్ మూవీ 23.. ఇది మామూలు సినిమా కాదు

23 Movie
x

23 Movie: ఓటీటీలోకి మల్లేశం డైరెక్టర్ లేటెస్ట్ మూవీ 23.. ఇది మామూలు సినిమా కాదు

Highlights

23 Movie: మన తెలుగులో నిజమైన కథలు రావట్లేదు.. తమిళ్, మలయాళంలో లాగా నేచురల్‌గా తీయట్లేదు అని చాలా మంది అంటుంటారు. కానీ, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లలో వాటిని పట్టించుకోం.

23 Movie: మన తెలుగులో నిజమైన కథలు రావట్లేదు.. తమిళ్, మలయాళంలో లాగా నేచురల్‌గా తీయట్లేదు అని చాలా మంది అంటుంటారు. కానీ, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లలో వాటిని పట్టించుకోం. అయినా, మంచి సినిమాలు కావాలని మాత్రం అడుగుతూనే ఉంటాం. అలాంటి వారందరికీ గట్టి సమాధానంగా ఇప్పుడు '23' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. "మల్లేశం" లాంటి గొప్ప సినిమాని తీసిన డైరెక్టర్ రాజ్ ఆర్, ఈ సినిమాను కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా జూన్ 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

"23" సినిమా కథేంటంటే.. ఒక యువకుడు చిన్న దొంగతనం చేయాలని అనుకుంటాడు. కానీ, అది అనుకోకుండా 23 మంది ప్రాణాలను తీసే పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఆ ఒక్క సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిలకలూరిపేట బస్సు దహనం లాంటి ఘటనలను గుర్తుచేసే ఈ సినిమా.. జైలు జీవితం, దళితుడిగా ఎదురైన కష్టాలు.. ఇవన్నీ కలిపి ఆ యువకుడిలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తాయి. తెరపై ఈ భావోద్వేగాలన్నీ చూస్తుంటే మనసు బరువెక్కిపోతుంది.

జైల్లో ఉన్న ఆ యువకుడు ఒక పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకం చాలా మందికి ఒక దారి చూపిస్తుంది. అది కేవలం అక్షరాలు కాదు, జీవితాలను మార్చే ఒక ఆయుధంలా మారుతుంది. ఈ సినిమాలో ఏ మాత్రం ఓవరాక్షన్ ఉండదు. దర్శకుడు, రచయితలు కథను చాలా నిజాయితీగా, భావోద్వేగంగా చెప్పడానికి ప్రయత్నించారు. అప్పట్లో ఈ సినిమాకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. తెలుగులో కూడా 'జై భీమ్' లాంటి సినిమాలు రావాలి" అని కోరుకునే వారికి ఇది ఒక సమాధానం. ఈ సినిమాలో ఉన్న నిజాయితీకి నాలుగు మార్కులు కూడా తక్కువే అని నెటిజన్లు చేసిన కామెంట్లు, సినిమా ఎంత లోతైనదో చూపిస్తాయి. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు, ఈటీవీ విన్, ఆహా వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది.

'23' సినిమా అనేది కేవలం ఒక వినోదం కాదు. అది మనల్ని ఆలోచింపజేస్తుంది, మనసును కదిలిస్తుంది, సమాజంలోని కొన్ని నిజాలను సూటిగా చూపిస్తుంది. థియేటర్లలో మిస్ అయినా, ఓటీటీలో చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, అర్థం చేసుకోవాల్సిన నిజాలు ఎన్నో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories