8 Vasantalu Movie Review: అంద‌మైన ప్రేమ క‌థ‌.. ఎనిమిది వ‌సంతాలు ఎలా ఉందంటే.?

8 Vasantalu Movie Review
x

8 Vasantalu Movie Review: అంద‌మైన ప్రేమ క‌థ‌.. ఎనిమిది వ‌సంతాలు ఎలా ఉందంటే.?

Highlights

8 Vasantalu Movie Review: అంద‌మైన ప్రేమ క‌థ‌.. ఎనిమిది వ‌సంతాలు ఎలా ఉందంటే.?

8 Vasantalu Movie Review: మ‌ధురం షార్ట్ మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు ఫ‌ణీంద్ర న‌ర్సెట్టి ఆ త‌ర్వాత "మను" సినిమా ద్వారా తనదైన శైలిని చాటుకున్నాడు. తాజాగా "ఎనిమిది వసంతాలు" అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అస‌లీ సినిమా క‌థేంటి.? ఎలా ఉంది.? లాంటి వివ‌రాలు ఈ రోజు రివ్యూలో చూద్దాం.

క‌థేంటంటే.?

శుద్ధి అయోధ్య (అనంతిక) తన తండ్రి మరణం తర్వాత రచయిత్రిగా మారుతుంది. పుస్తకాలు రాయడం, ట్రావెలింగ్, కరాటే ఇవన్నీ ఆమె జీవితంలో భాగమవుతాయి. ఈ స‌మ‌యంలోనే త‌న‌ అస్తులను అమ్మేందుకు అమెరికా నుంచి ఊటీకి వచ్చిన వరుణ్ (హను రెడ్డి), ఆమెను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. శుద్ధి కూడా వ‌రుణ్‌ను ఇష్ట‌ప‌డ‌డం ప్రారంభిస్తుంది. కానీ అమెరికా వెళ్లే సమయంలో వరుణ్ ఆమెను మోసం చేస్తాడు.

ఈ విషాదానంతరం, శుద్ధి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇంతలో సంజయ్ (రవితేజ) అనే వ్యక్తి పరిచయం అవుతాడు. వారిద్దరి మధ్య అభిమానం ప్రేమగా మారినా, శుద్ధి మాత్రం సంజయ్‌కు తన భావాలను చెప్పదు. అంతేకాకుండా, వరుణ్ అనే మరో యువకుడితో పెళ్లికి రెడీ అవుతుంది. శుద్ధి అలా చేయడానికి కారణాలు ఏంటి.? చివ‌రికి శుద్ధి జీవితం ఎలాంటి మ‌లుపు తిరిగింది లాంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనమే ప్రధాన బలం

తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథలు కొత్తవి కావు. కానీ ఫణీంద్ర నర్సెట్టికి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన చెబుతున్న పద్ధతి. సినిమా అంతా పొయెటిక్ ట‌చ్‌తో న‌డిపించారు. మొదటి సీన్ నుంచీ చివరి వరకూ కథను ఒక శిల్పంగా తయారు చేసినట్టు అనిపిస్తుంది.

ఫణీంద్ర మాటలు, ఇంటర్వ్యూలలో ఎమోషన్ ఎక్కువైపోయినా, సినిమాలో మాత్రం ఆయన హానెస్టీ స్పష్టంగా కనిపిస్తుంది. మాట‌లు చాలా బాగున్నాయి. కొన్ని స‌న్నివేశాలు కాస్త స్లోగా ఉన్న భావ‌న క‌లుగుతుంది. మాస్ సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా కాస్త నిరాశ‌ను క‌లిగించే అవ‌కాశం ఉంటుంది. కానీ పొయెటిక్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవాళ్లకు మాత్రం ఈ సినిమా ఓ ప్రయోగాత్మక అనుభూతిని కలిగిస్తుంది.

నటన, సాంకేతికత

అనంతిక ప్రధాన పాత్రలో బాగా ఒదిగిపోయింది. హను రెడ్డి, రవితేజ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటులు కూడా బాగా నటించారు కానీ ఎక్కువమంది కొత్తవాళ్లే కావడంతో, పాత్రలతో కనెక్ట్ అవ్వడం కొద్దిగా సమయం తీసుకుంటుంది.

హేషం అందించిన సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఫ్రేముల ఎంపికలో దర్శకుడు చూపిన శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, సినిమాకు ఇంకొంచెం ట్రిమ్మింగ్ జరిగితే మరింత ఆకర్షణీయంగా ఉండేది.

బాట‌మ్ లైన్

ఎనిమిది వసంతాలు అనేది ఓ సాధారణ ప్రేమకథలా కనిపించినా, దానిని చెప్పే పద్ధతిలో ఎంతో కవిత్వం, భావన, ప్రామాణికత ఉన్నాయి. మాస్ సినిమాలు ఇష్ట‌ప‌డేవారికి ఈ సినిమా న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారికి మాత్రం ఇదొక ఫీల్ గుడ్ మూవీగా నిలుస్తుంది.


Enimidi Vasanthalu review, Phanindra Narisetti new movie, Ananthika Telugu heroine, Telugu poetic love story, Maitri Movie Makers film, Enimidi Vasanthalu public talk, Enimidi Vasanthalu cast

Show Full Article
Print Article
Next Story
More Stories