8 Vasantalu OTT Release .. ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఇవే!

8 Vasantalu OTT Release .. ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఇవే!
x

8 Vasantalu OTT Release .. ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఇవే!

Highlights

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కొన్ని సినిమాలు ఇప్పుడు డిజిటల్ దారిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. '8 వసంతాలు', 'కలియుగం', 'నెరెవెట్ట' వంటి చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కొన్ని సినిమాలు ఇప్పుడు డిజిటల్ దారిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. '8 వసంతాలు', 'కలియుగం', 'నెరెవెట్ట' వంటి చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ప్రేమ, విరహం, సైన్స్‌ ఫిక్షన్ నేపథ్యాలతో ఈ సినిమాలు ప్రేక్షకుల మనసు దోచగలవో లేదో చూడాల్సిందే. ప్రత్యేకించి యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు డిజిటల్ వేదికలపై మెరుగైన స్పందన అందుకుంటాయని ఆశతో మేకర్స్ ఎదురుచూస్తున్నారు.

'8 వసంతాలు' డిజిటల్ ఎంట్రీకి రెడీ

అనంతిక, సనీల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా '8 వసంతాలు' త్వరలో ఓటీటీలో ప్రసారం కానుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఓ ప్రేమ జంట ఎనిమిదేళ్ల జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, అదే సమయంలో విడుదలైన 'కుబేర' బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో బాక్సాఫీస్‌ వద్ద '8 వసంతాలు'కి ఎదురుదెబ్బ తగిలింది.

ఇప్పుడు డిజిటల్ మాధ్యమం ద్వారా మరిన్ని ప్రేక్షకులకు చేరాలనే ఆశతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఓటీటీ వేదికపై ఈ రొమాంటిక్ జర్నీ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories