ఆచార్య టీం కాజల్ పై కోపం గా ఉందా?

Acharya Team: కాజల్ విషయంలో మౌనం వహిస్తున్న ఆచార్య బృందం

admin1
Updated on: 25 April 2022 2:45 PM IST
Acharya Team Angry With Kajal?
X

ఆచార్య టీం కాజల్ పై కోపం గా ఉందా?

Acharya Team: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు.

అయితే సినిమాకి సంబంధించి అందరి మీద ప్రశంసల వర్షం కురిపించారు కానీ ఈ సినిమాలో నటించిన కాజల్ గురించి మాత్రం ఒక్కరు కూడా మాట్లాడకపోవడం అభిమానులను షాక్కు గురి చేసింది. కాజల్ పాత్ర ఎలా ఉండబోతోందని అడిగినప్పటికీ రామ్ చరణ్ తాను ఇంకా సినిమా ఫైనల్ కట్ చూడలేదని ట్రైలర్ కట్ కూడా కొరటాల శివ చేశారని చెప్పారు. చూస్తూ ఉంటే ఆచార్య బృందం కాజల్ విషయంలో నిరాశ చెందినట్లు అనిపిస్తోంది. కానీ కారణం ఏంటి అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

నిజానికి ఆచార్య సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఫస్ట్ ఛాయిస్ కాదు. నయనతార త్రిష వంటి హీరోయిన్లు అనుకున్న దర్శకనిర్మాతలు ఆఖరికి కాజల్ ని రంగంలోకి దింపారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర పై కావాలని దర్శక నిర్మాతలు సీక్రెట్ గా ఉంటున్నారు అని కొందరు చెబుతున్నప్పటికీ కనీసం ఆమెకు సంబంధించిన ఒక్క విజువల్ కూడా బయటకు రాకపోవడం అభిమానులను బాధపెడుతోంది.

admin1

admin1

Next Story