Actor: సీనీ ఇండ‌స్ట్రీలో అలజడి.. న‌టుడి అనుమనాస్ప‌ద మృతి

Actor: సీనీ ఇండ‌స్ట్రీలో అలజడి.. న‌టుడి అనుమనాస్ప‌ద మృతి
x

Actor: సీనీ ఇండ‌స్ట్రీలో అలజడి.. న‌టుడి అనుమనాస్ప‌ద మృతి

Highlights

ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్‌లో నటించిన రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు

ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్‌లో నటించిన రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఓ జలపాతం సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. రోహిత్ శరీరంపై గాయాలు కనిపించడంతో, అతడిని హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, రోహిత్ ఇటీవల ముంబయి నుంచి గౌహతి తరలివచ్చారు. ఆదివారం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అయితే సాయంత్రం నుంచి ఆయన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాలింపు చర్యల్లో భాగంగా, ఓ జలపాతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

కొద్ది రోజుల క్రితం ఓ పార్కింగ్ అంశం కారణంగా ముగ్గురు వ్యక్తులతో రోహిత్‌కు గొడవ జరిగినట్టు తెలుస్తోంది. హత్యకు అదే కారణమై ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రోహిత్ ముఖం, తల, ఇతర శరీర భాగాల్లో గాయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక రోహిత్ నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories