Nandamuri Kalyan Ram: శ్రీకాళహస్తిలో నందమూరి కళ్యాణ్ రామ్ సందడి.. రాహు కేతు పూజలు నిర్వహించిన హీరో

Nandamuri Kalyan Ram: ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బుధవారం తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిని సందర్శించారు.
Nandamuri Kalyan Ram: ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బుధవారం తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిని సందర్శించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను ఆయన భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆలయ దక్షిణ గోపురం వద్దకు చేరుకున్న కళ్యాణ్ రామ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే రాహు కేతు పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం అంతరాలయ దర్శనం చేసుకుని స్వామి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం ఆలయ అధికారులు కళ్యాణ్ రామ్‌కు శ్రీ మృత్యుంజయ సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు, ఆలయ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.
కళ్యాణ్ రామ్ ఆలయానికి వచ్చారని తెలుసుకున్న స్థానిక అభిమానులు, భక్తులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడటంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. అభిమానులకు అభివాదం చేస్తూ కళ్యాణ్ రామ్ ముందుకు సాగారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



