
Actor Vijay
Actor Vijay: తమిళ నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం సంక్షోభంలో పడింది. భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం, పిల్లలు ఆయనకు దూరంగా ఉండటం వెనుక ఉన్న అసలు కారణాలేంటి?
Actor Vijay: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్ల రెమ్యునరేషన్‌తో రికార్డులు సృష్టించే దళపతి విజయ్, ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన 'క్లైమాక్స్' ఎదుర్కొంటున్నారు. ఒకవైపు తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో రాజకీయ సింహాసనం వైపు అడుగులు వేస్తుంటే, మరోవైపు ఆయన సొంత గూడు ముక్కలైందనే వార్తలు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సంగీత వర్సెస్ విజయ్
గత కొన్నేళ్లుగా విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం సాగుతున్నప్పటికీ.. తాజాగా ఆమె చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం ముదిరినట్లు అర్థమవుతోంది. "నీలాంకరైలోని మా సొంత నివాసంలోకి నన్ను రానివ్వడం లేదు.. విడాకుల కేసు తేలే వరకు నాకు అక్కడ ఉండే హక్కు కల్పించండి" అంటూ సంగీత దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
చెల్లాచెదురైన కుటుంబం.. ఎవరి దారి వారిదేనా?
ఒకప్పుడు అన్యోన్యంగా కనిపించిన విజయ్ కుటుంబం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటున్నారనే వార్తలు అభిమానులను కలచివేస్తున్నాయి.
సంగీత ప్రస్తుతం లండన్‌లో ఉంటూ, కేవలం కేసుల నిమిత్తమే చెన్నై వస్తున్నారు. జాసన్ సంజయ్ తండ్రి వద్ద ఉండలేక అశోక్ నగర్‌లోని ఒక అద్దె ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు.దివ్య సాషా కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, ఒక పీజీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్, తల్లి శోభ చాలా కాలంగా విజయ్‌కు దూరంగా వేరుగా ఉంటున్నారు.
కారణం అదేనా? విమర్శల జడివాన
ఒక స్టార్ నటితో విజయ్‌కు ఉన్న సాన్నిహిత్యమే ఈ చిచ్చుకు కారణమని భార్య సంగీత ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. "సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు.. రాష్ట్రాన్ని ఏం ఏలుతాడు?" అంటూ రాజకీయ ప్రత్యర్థులు దళపతిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నా, కన్నవారు, భార్యాపిల్లలు పక్కన లేకపోవడం విజయ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గ్లామర్ ప్రపంచంలో వెలుగుల వెనుక ఇన్ని చీకటి కోణాలు ఉంటాయని విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. మరి ఈ 'దళపతి' తన కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కి రాజకీయాల్లో విజేతగా నిలుస్తారా? లేక ఈ వివాదాలు ఆయన ప్రతిష్ఠను దెబ్బతీస్తాయా? వేచి చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




