Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

Actress Namitha: మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఘటన

Shashank Gullapelli
Updated on: 26 Aug 2024 9:31 PM IST
Actress Namitha Has Complained That Madurai Meenakshi Amman Temple Officials Asked Her About Her Caste
X

Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

Actress Namitha: మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. మదుర మీనాక్షి దేవాలయ సిబ్బంది తనతో అగౌరవంగా మాట్లాడారని నటి నమిత ఆరోపించారు. తనని దేవాలయంలోకి వెళ్లనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ... ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాగా... నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించింది. నమితతో ఎవరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదని... ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడినట్టు వివరణ ఇచ్చారు. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పామని.. తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించామని వెల్లడించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story