Actress Prathyusha Death Case: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలని ఆదేశం!

Actress Prathyusha Death Case: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలని ఆదేశం!
x
Highlights

Prathyusha Death Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

Prathyusha Death Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, ఆయనను వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

గతంలో ఈ కేసును విచారించిన హైకోర్టు, సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ, నిందితుడు శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో ఒక కీలక ఘట్టం ముగిసినట్లయింది.

అసలేం జరిగింది? (కేసు నేపథ్యం):

ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ప్రేమలో పడ్డారు. ప్రత్యూష హీరోయిన్‌గా ఎదుగుతున్న క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం వేళ వీరిద్దరూ విషం తీసుకున్నారు. వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటి రోజే ప్రత్యూష ప్రాణాలు విడిచింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం మార్చి 9న కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగడం వల్లే ఈ మరణం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. అయితే, దీని వెనుక కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పింది సిద్ధార్థ రెడ్డియేనని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. అయితే, వైద్యుల నివేదిక ప్రకారం ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని స్పష్టమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories