Rakul Preet Singh: నచ్చని ఫుడ్ ఆర్డర్‌ ఇచ్చినందుకు బ్రేకప్‌ చెప్పేశా..!

Actress Rakul Preet Singh About Her Breakup Love Story
x

Rakul Preet Singh: నచ్చని ఫుడ్ ఆర్డర్‌ ఇచ్చినందుకు బ్రేకప్‌ చెప్పేశా..!

Highlights

Rakul Preet Singh: అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Rakul Preet Singh: అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి పీటలెక్కిందీ బ్యూటీ. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కూడా నటించడం లేదు. చివరిగా ఇండియన్‌ 2లో కనిపించించిన రకుల్‌ తెలుగులో సినిమాలు బాగా తగ్గించేసింది. ఇదిలా ఉంటే తన జీవితంలో జరిగిన బ్రేకప్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుందీ బ్యూటీ.

ఈ విషయమై రకుల్ మాట్లాడుతూ.. జాకీ తన జీవితంలో రాకముందు సంబంధాల విలువ తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌తో ఉన్న రకుల్ ఓ చిన్న కారణానికి అతడిని రిజక్ట్‌ చేశానని తెలిపింది. అయితే ఈ బ్రేకప్‌కు రకుల్‌ చెప్పిన కారణం ఏంటో నచ్చని ఫుడ్‌ ఆర్డర్‌ చేయడమే. అవును ఓసారి ఇద్దరూ హోటల్‌కు వెళ్లిన సమయంలో అతను ఫ్రైడ్‌ ఆహారాన్ని ఆర్డర్‌ చేశాడంటా.. అది తనకు నచ్చలేదని, అందుకే బ్రేకప్‌ చెప్పేశానని తెలిపింది.

నాకంటూ కొన్ని సొంత ఆహారపు అలవాట్లు ఉంటాయని, అతడు నేను ఆర్డర్‌ చేసిన ఆహారాన్ని తక్కువ చేసి చూశాడు. భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తి నాకెందుకు అనిపించింది. అందుకే బ్రేకప్‌ చెప్పానని అసలు కారణం చెప్పింది. ఇక రకుల్‌ తాను ఆహారం విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, దాన్ని ఎంతో గౌరవిస్తానని చెప్పుకొచ్చింది.

ఇక భర్త జాకీ గురించి కూడా రకుల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తామిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉన్నామని తెలిపింది. తాను షూటింగ్‌ ముగించుకొని వచ్చే సమయానికి జాకీ కూడా ఇంటికి వచ్చేస్తాడని.. ఇద్దరం సరదాగా సమయాన్ని గడుపుతామన్నారు. మొత్తం మీద రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories