Regina Cassandra: నాకంటూ ప్రత్యేక లక్ష్యాలేం లేవు.. రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు

Actress regina cassandra interesting comments about her next movie
x

Regina Cassandra: నాకంటూ ప్రత్యేక లక్ష్యాలేం లేవు.. రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు 

Highlights

ఇక 2023లో వచ్చిన 'నేనా నా' సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదీ చిన్నది. అయితే ప్రస్తుతం చేతిలో ఏకంగా 5 సినిమాలతో బిజీగా ఉంది రెజీనా.

2012లో వచ్చిన 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి రెజీనా. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో వరుసగా సినిమాల్లో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన రెజీనా.. పలువురు అగ్ర కథానాయకుల సరసన నటించింది. ఇక ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు తమిళంతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లోనూ నటించింది.

ఇక 2023లో వచ్చిన 'నేనా నా' సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదీ చిన్నది. అయితే ప్రస్తుతం చేతిలో ఏకంగా 5 సినిమాలతో బిజీగా ఉంది రెజీనా. తాజాగా ఈ బ్యూటీ నటించిన 'ఉత్సవం' సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రెజీనా సినిమాతో పాటు, తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఉత్సవం చాలా మంచి సినిమా అని తెలిపిన రెజీనా.. ఈ సినిమా రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఉంటుందని, దర్శకుడు అర్జున్‌ ఈ కథ వినిపించినప్పుడే నాకు చాలా గొప్పగా అనిపించిందని చెప్పుకొచ్చింది. మంచి సందేశంతో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుందని రెజీనా ధీమా వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇందులో తాను కార్పొరేట్‌ ఉద్యోగిగా కనిపిస్తానని, తనకు ప్రేమ మీద అంతగా ఆసక్తి ఉండదని చెప్పుకొచ్చింది.

ఇక తన కెరీర్‌కు సంబంధించి మాట్లాడుతూ.. తనకంటూ ప్రత్యేకంగా లక్ష్యాలేం లేవని తెలిపిన రెజీనా... తొలి తెలుగు సినిమా ‘ఎస్‌ఎంఎస్‌’ చేసినప్పటి నుంచి విలక్షణమైన నటిగా ఉండాలనుకున్నాని, అది తన నుంచి దూరం కాకుండా ఇన్నాళ్లు విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చింది. ఇకపైనా తాను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే తన గోల్‌ అని చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories