Renu Desai: రెండో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవడానికి కారణం అదే.. రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Renu Desai: రేణు దేశాయ్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Aug 2024 3:33 PM IST
Actress Renu Desai Interesting Comments About her 2nd Marriage Cancel
X

Renu Desai: రెండో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవడానికి కారణం అదే.. రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Renu Desai: రేణు దేశాయ్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రేణు. పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే ఉంటూ తమ చిన్నారుల బాధ్యతను చూసుకుంటున్నారు రేణు. ఇక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రేణు దేశాయ్‌ అడపాదపడా పలు సేవ కార్యక్రమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటించారు.

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్‌కి ట్రోలింగ్స్‌ సైతం పెద్ద ఎత్తున ఎదురవుతుంటాయి. అలాంటి ట్రోలింగ్స్‌కు తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ముందుకు సాగుతుంటారు రేణు. ఇదిలా ఉంటే గతంలో రేణు దేశాయ్‌ రెండో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రేణు దేశాయ్‌ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే కారణం తెలియకపోయినప్పటికీ.. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు రేణు.

అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి రద్దుకు గల కారణాన్ని రేణు చెప్పుకొచ్చారు. ఈ విషయమై రేణు దేశాయ్‌ మాట్లాడుతూ.. 'నా చిన్న‌ప్పుడు నా త‌ల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టాను అని చాలా బాధపడ్డారు. మా నాన్న అయితే.. న‌న్ను తాకేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. అప్ప‌ట్లో ఆడ‌పిల్ల పుడితే చంపేసేవారు అయితే నా పేరెంట్స్ చ‌దువుకున్నవారు కావ‌డంతో న‌న్ను అలా చేయ‌లేదు. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమ‌ను నేను దక్కించుకోలేక‌పోయాను. అయితే విడాకుల ప్ర‌క‌టించిన అనంత‌రం నా పేరెంట్స్ న‌న్ను ద‌గ్గ‌రికి కూడా తీసుకోలేదు. అది న‌న్ను చాలా భాద‌పెట్టింది. నాలాగే నా పిల్ల‌ల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న కూడా త‌ర్వాత క్యాన్సిల్ చేసుకున్నాను' అని చెప్పుకొచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story