Roshni Haripriyan Wedding: వైభవంగా నటి రోషిణి హరిప్రియన్ వివాహం.. ప్రియుడిని పెళ్లాడిన 'కన్నమ్మ'!


Roshni Haripriyan Wedding: వైభవంగా నటి రోషిణి హరిప్రియన్ వివాహం.. ప్రియుడిని పెళ్లాడిన 'కన్నమ్మ'!
Roshni Haripriyan Wedding: ప్రేమించిన వాడినే పెళ్లాడిన 'భారతి కన్నమ్మ' నటి! తమిళ నటి రోషిణి హరిప్రియన్, కేఎస్ సుందర మూర్తిల వివాహం ఆదివారం (ఫిబ్రవరి 15) వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు వైరల్.
Roshni Haripriyan Wedding: తమిళ బుల్లితెర ప్రేక్షకులకు 'కన్నమ్మ'గా చిరపరిచితమైన నటి రోషిణి హరిప్రియన్ ఓ ఇంటిదయ్యారు. తన దీర్ఘకాల ప్రియుడు, సంగీత దర్శకుడు కేఎస్ సుందర మూర్తితో కలిసి ఆమె ఆదివారం (ఫిబ్రవరి 15, 2026) ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
బుల్లితెర నుంచి వెండితెరకు..
రోషిణి 'భారతి కన్నమ్మ' సీరియల్‌తో ఊహించని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ తర్వాత 'కూకు విత్ కోమలి' రియాలిటీ షోలో పాల్గొని తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. బుల్లితెరపై సక్సెస్ అయ్యాక 'గరుడన్', 'మద్రాస్ మ్యాట్నీ' వంటి చిత్రాలతో వెండితెరపై కూడా మెరిశారు. ఆమె నటించిన చివరి చిత్రం 'తలైవా తలైవి' తెలుగులో 'సార్ మేడమ్' పేరుతో విడుదలై ప్రేక్షకులను అలరించింది.
హాజరైన సెలబ్రిటీలు:
ఈ వివాహ వేడుకకు 'భారతి కన్నమ్మ' టీమ్ సభ్యులతో పాటు బుల్లితెర, వెండితెరకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అభిమానులు "కన్నమ్మ పెళ్లి చేసుకుంది" అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Bharathi Kannama serieal fame #RoshniHariPriyan getting married. pic.twitter.com/MRKxSFH4NG
— CineFriday (@Cine_Friday) February 15, 2026

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



