
Aditi Myakal : శివాజీపై హీరోయిన్ ఫైర్..అతను నా చెస్ట్‌పై అలా చేశాడంటూ షాకింగ్ కామెంట్స్
Aditi Myakal: షూటింగ్ సమయంలో అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. శివాజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అదితి మాయకల్
Dressing Controversy: సినిమా రంగంలో గ్లామర్ ,సంప్రదాయం మధ్య జరిగే చర్చ ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. గతంలో 'ది రాజా సాబ్' మూవీ ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్ వస్త్రధారణపై శివాజీ చేసిన పద్ధతిగా ఉండాలి అనే వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. సింగర్ చిన్మయి, అనసూయ వంటి వారు అప్పట్లో శివాజీని తీవ్రంగా నిలదీశారు. చివరకు మహిళా కమిషన్ వరకు వెళ్ళిన ఈ వివాదంపై శివాజీ క్షమాపణలు చెప్పడంతో అంతా సద్దుమణిగిందని భావించారు. కానీ తాజాగా నటి అదితి మ్యాకల్ చేసిన వ్యాఖ్యలు ఈ తేనెతుట్టెను మళ్ళీ కదిలించాయి.
అదితి మ్యాకల్ శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. శివాజీ గారు నటించిన పాత సినిమాల్లో హీరోయిన్లు ఎంతో బోల్డ్‌గా దుస్తులు ధరించారు. మరి అప్పుడు ఆయనకు ఈ దుస్తుల పద్ధతి గుర్తుకు రాలేదా?" అని సూటిగా ప్రశ్నించారు. సినిమాల్లో మేము వేసుకునే దుస్తులే మాకు తిండి పెడుతున్నాయి.. వాటిని జడ్జ్ చేయడం సరైనది కాదు అని ఆమె కుండబద్దలు కొట్టారు.
కేవలం డ్రెస్సింగ్ గురించే కాకుండా, అమ్మాయిలు ఎదుర్కొనే భద్రతా సమస్యల గురించి కూడా అదితి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 'అమీ తుమీ' ప్రమోషన్ల కోసం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కిటికీ అద్దాల గుండా చేయి దూర్చి తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చాతీపై చేయి వేశాడని చెప్పి ఆమె బాధపడింది.
ఆ సమయంలో తాను తీవ్రమైన భయాందోళనకు గురయ్యానని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న తమకు బాసటగా ఉండాల్సింది పోయి, దుస్తులపై కామెంట్స్ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సమాజంలో అమ్మాయిల పట్ల ఉన్న ధోరణిని అదితి తప్పుబట్టారు. "బయట తిరిగేటప్పుడు మీ బ్రా కనిపిస్తుంది.. మీ నెక్ డీప్‌గా ఉంది.. అంటూ కొంతమంది మహిళలు కూడా ఉచిత సలహాలు ఇస్తుంటారు. దయచేసి మమ్మల్ని జడ్జ్ చేయడం మానేయండి. మేము ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం" అని ఆమె గట్టిగా చెప్పారు.
అదితి మ్యాకల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ధైర్యానికి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. వస్త్రధారణ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని, సమాజంలో మహిళల భద్రతపై దృష్టి పెట్టాలే కానీ, వారి బట్టలపై కాదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




