Rajinikanth: ఆ సినిమాలకు రజినీకాంత్ దూరం!

Rajinikanth: ఆ సినిమాలకు రజినీకాంత్ దూరం!
x
Highlights

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’కి ఏ సర్టిఫికెట్ రావడంతో థియేటర్లలో పూర్తి రీచ్ కాలేదు.

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’కి ఏ సర్టిఫికెట్ రావడంతో థియేటర్లలో పూర్తి రీచ్ కాలేదు. బలమైన ఓపెనింగ్ ఉన్నా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రజినీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ రేటెడ్ అంశాలు లేకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లపై దృష్టి సారించనున్నారు.

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం తెలిసిందే. దీంతో థియేటర్లలో అందరూ చూడలేకపోయారు. రిలీజ్ మొదటి రోజుల్లో భారీ కలెక్షన్లు సాధించినా, ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. ఈ ప్రభావంతో రజినీకాంత్ ఇకపై తన చిత్రాల్లో ఏ రేటెడ్ అంశాలు ఉండకూడదని నిర్ణయించారు.

ప్రస్తుతం ఆయన ‘జైలర్-2’లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, దర్శకుడు సుందర్ సి రజినీకి కొన్ని కథలు చర్చించారు. రజినీ ఇకపై ఫ్యామిలీ ఫ్రెండ్లీ, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలపై దృష్టి పెట్టారని సమాచారం. కోలీవుడ్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. రజినీ ఈ నిర్ణయంతో ప్రేక్షకులను మరింత దగ్గర చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రజినీకాంత్ రాబోయే చిత్రాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories