Agent: "ఏజెంట్" బడ్జెట్ తగ్గించనున్న నిర్మాత

Agent Movie Producer will Decreasing Budget
x

ఏజెంట్ సినిమా బడ్జెట్ తగ్గించనున్న ప్రొడ్యూసర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Agent: "ఏజెంట్" పై ప్రభావం చూపనున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" కలెక్షన్లు

Agent: చాలా కాలం పాటు వాయిదా పడిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా ఎట్టకేలకు విడుదలైంది. అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డివైడెడ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఒక మాదిరి వసూళ్లతో పర్వాలేదు అనిపిస్తుంది. ఫైనల్ రన్ పూర్తయ్యే లోపల సినిమా కలెక్షన్లు పాతిక కోట్ల వరకు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నంబర్ అఖిల్ తదుపరి సినిమా అయిన "ఏజెంట్" పై చెడు ఎఫెక్ట్ చూపిస్తాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. "సైరా నరసింహారెడ్డి" ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ "ఏజెంట్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు యాభై కోట్ల వరకు బడ్జెట్ ని పెట్టనున్నారు. కానీ ఇప్పటిదాకా అఖిల్ కరియర్ లో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఆఖరికి "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. మరి "ఏజెంట్" సినిమాకోసం బడ్జెట్ 50 కోట్లు పెడితే సినిమా 60 కోట్ల దాకా వసూలు చేసే దాకా నిర్మాతలకి ప్రాఫిట్ రాదు. ఈ విధంగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" కలెక్షన్లు "ఏజెంట్" సినిమా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో నిర్మాత అనిల్ సుంకర కూడా కొంచం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే బడ్జెట్ ని 40 కోట్ల కి కుదించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories