Aishwarya Rajesh: నిన్ను సె** డ్రెస్సుల్లో చూడాలని ఆ నిర్మాత బలవంత పెట్టాడు

Aishwarya Rajesh: నిన్ను సె** డ్రెస్సుల్లో చూడాలని ఆ నిర్మాత బలవంత పెట్టాడు
x
Highlights

Aishwarya Rajesh: సినిమా ప్రపంచంలో కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రయాణం కూడా అలాంటిదే.

Aishwarya Rajesh: సినిమా ప్రపంచంలో కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రయాణం కూడా అలాంటిదే. ఆమె కెరీర్ ఇప్పుడు టాప్ గేర్‌లో ఉండవచ్చు కానీ, ఆ స్థాయికి చేరడానికి ఆమె పడ్డ కష్టాలు వింటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. చాలా మందికి ఐశ్వర్య రాజేష్ అంటే కేవలం ఒక నటిగానే తెలుసు.

కానీ ఆమె దివంగత నటుడు రాజేష్ కుమార్తె అన్న విషయం కొందరికే తెలుసు. సినీ నేపథ్యం ఉన్నా ఆమెకు అవకాశాలు సులభంగా రాలేదు. చిన్న వయసులోనే తండ్రిని, ఆ తర్వాత ఇద్దరు అన్నలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెపై కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా పడ్డాయి. ఆ కష్ట కాలంలోనే ధైర్యం చేసి నటన వైపు అడుగులు వేసింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక భయంకరమైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఒక నిర్మాత తనను ఆడిషన్‌కు పిలిచి, నటన గురించి కాకుండా శరీరం గురించి అసభ్యంగా మాట్లాడటం తనను విస్మయానికి గురిచేసిందని తెలిపింది.

నిన్ను సెక్సీ డ్రెస్సుల్లో చూడాలి.. అలాంటి బట్టల్లో రా, నీ బాడీ చూడాలి అంటూ ఆ నిర్మాత ఒత్తిడి చేయడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. నాతోనే ఇలా ప్రవర్తించిన ఇతను, ఇంకెంత మంది అమాయకపు అమ్మాయిల దగ్గర ఇలా ప్రవర్తించి ఉంటాడు? అని. కేవలం అవకాశం కోసం ఒక ఆడపిల్లను వస్తువులా చూడటం తనని కలిచివేసిందని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.కళ్లముందు కదిలిన 'ఖడ్గం' సీన్ ఈ చేదు అనుభవం ఎదురైనప్పుడు తనకు 'ఖడ్గం' సినిమాలో నటి సంగీత చేసే ఒక్క ఛాన్స్" సీన్ గుర్తొచ్చిందని ఐశ్వర్య భావోద్వేగానికి గురైంది. ఆ సినిమాలో నటి పడే ఆవేదనను తాను నిజ జీవితంలో అనుభవించాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించింది.

ఇన్ని తిరస్కరణలు, అవమానాలు ఎదురైనా ఐశ్వర్య వెనకడుగు వేయలేదు. గ్లామర్ కంటే కంటెంట్‌కే ప్రాధాన్యతనిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఆమె అందుకున్న విజయం, తనను తక్కువ చేసిన వారందరికీ గట్టి సమాధానం చెప్పినట్లయ్యింది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడితే విజయం వరిస్తుందని ఐశ్వర్య నిరూపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories