Valimai First Look Poster: వైరలౌతోన్న అజిత్ 'వాలిమై' ఫస్ట్ లుక్

Valimai First Look Poster: హీరో అజిత్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వాలిమై మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదలైంది

Kranthi
Published on: 12 July 2021 11:21 AM IST
Ajith Kumar Valimai Movie First Look Poster Released
X

Ajith Valimai First Look: (Photo:The Hans India)

Ajith Valimai First Look Poster: ఎట్టకేలకు తమిళ హీరో అజిత్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వాలిమై మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదలైంది. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అజిత్ మరోసారి సీబీ సీఐడీ అధికారి పాత్రలో అలరించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తలా సీబీ సీఐడీ అధికారి పాత్రలో నటించిన ఈ చిత్రంలో RX 100 ఫేమ్ కార్తికేయ విలన్ పాత్రలో అలరించనున్నారు. 'నాని 'గ్యాంగ్ లీడర్' తర్వాత కార్తికేయ ఇపుడు అజిత్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అజిత్ కు జోడీ హ్యుమా ఖురేషి నటిస్తుండగా యవన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. బోనీ కపూర్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

అభిమానులు ఏడాది కాలంగా వాలిమై మూవీ అప్ డేట్ ఇవ్వండంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అభిమానుల తీరు పై ఆయన అసహనం కూడా వ్యక్తం చేస్తూ సహనంతో ఉండాలని అభ్యర్థించారు. ఎట్టకేలకు వాలిమై ఫస్టు లుక్ విడుదలతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Kranthi

Kranthi

Next Story