పావలా శ్యామలకు అండగా ఐకాన్ స్టార్.. ప్రతి నెలా పెన్షన్ తరహాలో అల్లు అర్జున్ భారీ సాయం!

పావలా శ్యామలకు అండగా ఐకాన్ స్టార్.. ప్రతి నెలా పెన్షన్ తరహాలో అల్లు అర్జున్ భారీ సాయం!
x

పావలా శ్యామలకు అండగా ఐకాన్ స్టార్.. ప్రతి నెలా పెన్షన్ తరహాలో అల్లు అర్జున్ భారీ సాయం!

Highlights

Allu Arjun: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వందలాది చిత్రాల్లో తనదైన నటనతో అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ప్రస్తుతం అత్యంత దీనస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే.

Allu Arjun: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వందలాది చిత్రాల్లో తనదైన నటనతో అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ప్రస్తుతం అత్యంత దీనస్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యం, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నారు.

ప్రస్తుతం పావలా శ్యామల తన కుమార్తెతో కలిసి సికిందరాబాద్ కార్ఖానా ప్రాంతంలోని ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కనీసం మందులు కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బన్నీ వెంటనే స్పందించారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి వంటి పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థికంగా సాయం అందించినప్పటికీ, అల్లు అర్జున్ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి శాశ్వత ఏర్పాట్లు చేశారు. పావలా శ్యామల మరియు ఆమె కుమార్తె నిత్యావసరాలు, వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా 10 వేల రూపాయల ఆర్థిక సాయం క్రమం తప్పకుండా అందేలా ఫిక్స్‌డ్ ఏర్పాట్లు చేశారు.

కేవలం ఒక్కసారి సాయం చేసి వదిలేయకుండా, ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి నెలా ఆమెకు భరోసా కల్పించిన అల్లు అర్జున్ నిర్ణయం పట్ల చిత్ర పరిశ్రమతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను ఆదుకోవడంలో 'పుష్ప' స్టార్ చూపిన చొరవ నిజమైన హీరో అనిపించుకుందని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories