Allu Arjun: దిమ్మతిరిగేలా బన్నీ - లోకేష్ కనగరాజ్ స్టోరీ?

Allu Arjun: దిమ్మతిరిగేలా బన్నీ - లోకేష్ కనగరాజ్ స్టోరీ?
x
Highlights

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ మరింత బిజీ అవుతోంది. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ బన్నీకి ఒక సూపర్ హీరో స్టోరీ చెప్పినట్టు సమాచారం.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైనప్ మరింత బిజీ అవుతోంది. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ బన్నీకి ఒక సూపర్ హీరో స్టోరీ చెప్పినట్టు సమాచారం. హాలీవుడ్ ఫేమస్ డీసీ కామిక్ ‘ది స్టీల్ క్లా’ ఆధారంగా ఈ కథ ఉంటుందని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అట్లీతో భారీ ప్రాజెక్టు చేస్తున్న బన్నీ లైనప్ ఇప్పుడు మరింత బిగిసిపోయింది. ఈ క్రమంలో తమిళ్ టాప్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్‌కు ఒక థ్రిల్లింగ్ కథాంశం వినిపించినట్టు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథ డీసీ కామిక్స్‌లో 1962లో ప్రచురితమైన ‘ది స్టీల్ క్లా’ ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది.

ఓ వ్యక్తి యాక్సిడెంట్‌లో ఎడమ చేయి కోల్పోతాడు. అతనికి ఇనుప చేయి అమరుస్తారు. ఆ తర్వాత అనుకోని ఘటనతో అతనికి అదృశ్యమయ్యే శక్తి వస్తుంది. కానీ అతని ఇనుప చేయి మాత్రం మాయమవ్వదు. ఇలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను లోకేష్ బన్నీకి నారేట్ చేశాడని సమాచారం. అయితే ఈ కామిక్ హక్కులు సొంతం చేసుకున్నారా? అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories