
Allu Arjun: అల్లు అర్జున్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తమ్ముడికి కాదండోయ్..!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 15వ పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డికి రూ. 5 కోట్ల విలువైన బెంజ్ ఏ.ఎం.జి కారును బహుమతిగా ఇచ్చారు. అల్లు శిరీష్ పెళ్లి కానుకపై జరుగుతున్న ప్రచారానికి ఈ వైరల్ వీడియోతో తెరపడింది.
Allu Sneha Reddy: సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. అల్లు శిరీష్ - నైనిక రెడ్డిల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో అన్నగా అల్లు అర్జున్ తన తమ్ముడికి ఒక ఖరీదైన లగ్జరీ కారును కానుకగా ఇచ్చారని అభిమానులు చర్చించుకున్నారు. అన్నదమ్ముల అనుబంధానికి ఇది నిదర్శనమని ప్రశంసలు కురిపించారు. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! ఆ ఖరీదైన కారు శిరీష్ కోసం కాదు.. తన ప్రియతమ భార్య అల్లు స్నేహారెడ్డి కోసం అని తేలిపోయింది.
15 ఏళ్ల బంధం.. 5 కోట్ల కానుక
మార్చి 6, 2011న అల్లు అర్జున్ - స్నేహారెడ్డి వివాహం జరిగింది. సరిగ్గా ఈ ఏడాది మార్చి 6 నాటికి వీరి వైవాహిక బంధం 15 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని మరింత స్పెషల్గా మార్చాలని నిర్ణయించుకున్న బన్నీ, తన భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. మార్కెట్లో దాదాపు 4 నుండి 5 కోట్ల రూపాయల విలువ చేసే అత్యాధునిక మెర్సిడెస్ బెంజ్ ఏ.ఎం.జి మోడల్ కారును ఆమెకు పెళ్లి రోజు కానుకగా అందించారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
ఒకే రోజు రెండు వేడుకలు
ఈ ఏడాది మార్చి 6 అల్లు కుటుంబానికి డబుల్ ధమాకా అని చెప్పాలి. ఒకవైపు బన్నీ-స్నేహల 15వ పెళ్లి రోజు వేడుకలు జరుగుతుండగా, అదే రోజున తమ్ముడు అల్లు శిరీష్ కూడా నైనికతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా స్నేహారెడ్డికి విషెస్ చెబుతూ బన్నీ చేసిన పోస్ట్ అభిమానుల మనసు గెలుచుకుంది. సాధారణంగానే పుట్టినరోజులు, పెళ్లి రోజులకు స్పెషల్ గిఫ్ట్లు ఇవ్వడం బన్నీకి అలవాటు, కానీ ఈసారి తన 15వ వార్షికోత్సవం కావడంతో ఏకంగా లగ్జరీ కారునే రంగంలోకి దించారు.
కెరీర్ పరంగా ఫుల్ జోష్
ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు ఐకాన్ స్టార్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్లో బన్నీ పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.మొత్తానికి అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అల్లు అర్జున్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
Celebrating 15 years of love and togetherness. 🖤
— Team Allu Arjun (@TeamAAOfficial) March 7, 2026
A special anniversary surprise from Icon star @alluarjun for #AlluSnehaReddy garu 🤩
A wholesome moment. ✨ pic.twitter.com/nNxU7QefDd

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




