Pushpa 2: జపాన్ మార్కెట్‌ను షేక్ చేయడానికి పుష్ప‌రాజ్ రెడి .. రిలీజ్ ఎప్పుడంటే..!

Pushpa 2: జపాన్ మార్కెట్‌ను షేక్ చేయడానికి పుష్ప‌రాజ్ రెడి .. రిలీజ్ ఎప్పుడంటే..!
x

Pushpa 2: జపాన్ మార్కెట్‌ను షేక్ చేయడానికి పుష్ప‌రాజ్ రెడి .. రిలీజ్ ఎప్పుడంటే..!

Highlights

Pushpa 2: అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది.

Pushpa 2: అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం జపాన్‌లో డబ్బింగ్ వెర్షన్‌తో జనవరి 16, 2026న విడుదల కానుంది. ఈ విషయం ఇప్పుడు సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2 ది రూల్ భారత్‌తోపాటు అంతర్జాతీయంగా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ అయి విజయవంతంగా ఆడింది. తాజాగా జపాన్ మార్కెట్‌లోకి ఈ సినిమా అడుగుపెట్టనుంది. జనవరి 16, 2026న జపాన్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని నిర్మాతలు ప్రకటించారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం జపాన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప ఫ్రాంచైజీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక జపాన్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories