Ameesha Patel: 100కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రల్లో నటించను..షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

Ameesha Patel: 100కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రల్లో నటించను..షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్  హీరోయిన్
x
Highlights

Ameesha Patel: అమీషా పటేల్..ఒక్కప్పటికీ అందాలతార. ఇప్పుడా తార కోపంతో రగిలిపోతుంది. గదర్ 2 డైరెక్టర్ అనిల్ శర్మపై మండిపడుతోంది. పూర్తి వివరాలు చూస్తే...

Ameesha Patel: అమీషా పటేల్..ఒక్కప్పటికీ అందాలతార. ఇప్పుడా తార కోపంతో రగిలిపోతుంది. గదర్ 2 డైరెక్టర్ అనిల్ శర్మపై మండిపడుతోంది. పూర్తి వివరాలు చూస్తే ఈమధ్యే ఓ ఇంటర్వ్యూలో అనిల్ శర్మ మాట్లాడారు. గదర్ 2 లో అత్తగా నటించేందుకు అమీషా అంగీకరించలేదట..నర్గీస్ దత్ వంటి మహానటీమణులు చిన్న వయస్సులోనే వృద్ధ పాత్రల్లో యాక్ట్ చేశారని చెప్పినా..ఆమె మాత్రం చేయను గాక చేయనని చెప్పారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అమీషా పటేల్ కూడా వివరణ ఇచ్చారు. డియర్ అనిల్ అది జీవితం కాదని కేవలం సినిమా మాత్రమే. కాబట్టి నేను స్క్రీన్ పై ఏం చేయాలి..ఏం చేయకూడదనేది పూర్తిగా నా వ్యక్తిగతం. గదర్ కోసమే కాదు..ఏ సినిమా కోసమైనా సరే..అత్తయ్య పాత్రలు నేను చేయను. వందకోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలకు నేను ఓకే చెప్పను. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. దాన్ని తగ్గించుకోవద్దంటూ ఘాటుగా స్పందించింది అమీషా పటేల్.


Show Full Article
Print Article
Next Story
More Stories