థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో అనగనగా ఆస్ట్రేలియాలో.. ఆసక్తిని పెంచేసిన ట్రైలర్‌

థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో అనగనగా ఆస్ట్రేలియాలో.. ఆసక్తిని పెంచేసిన ట్రైలర్‌
x
Highlights

Anaganaga Australia Lo trailer: సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై, బి.టి.ఆర్ శ్రీనివాస్ సమర్పణలో తారక రామ దర్శకత్వం వహించిన చిత్రం "అనగనగా ఆస్ట్రేలియాలో".

Anaganaga Australia Lo trailer: సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై, బి.టి.ఆర్ శ్రీనివాస్ సమర్పణలో తారక రామ దర్శకత్వం వహించిన చిత్రం "అనగనగా ఆస్ట్రేలియాలో". థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సనిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక రామ మాట్లాడుతూ, సినిమాను పూర్తిగా ఆస్ట్రేలియాలో చిత్రీకరించినట్లు తెలిపారు. నటీనటులు, సాంకేతిక బృందం అంతా తెలుగువారేనని వెల్లడించారు. తాను ఆస్ట్రేలియాలో ఐటీ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డానని, సినిమాలపై ఉన్న ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్స్ పూర్తిచేశానన్నారు.

మెల్‌బోర్న్ వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో షూటింగ్ సమయంలో చాలాచోట్ల సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే సినిమాను 83 వేర్వేరు లొకేషన్లలో 122 రోజులపాటు చిత్రీకరించడం గర్వకారణమని చెప్పారు. పలువురు ఈ కథను ఆస్ట్రేలియాలో తీయడం కష్టమని చెప్పినప్పటికీ, ధైర్యంగా ముందుకు సాగి సినిమాను పూర్తి చేశానన్నారు. ఈ చిత్రం ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే విడుదల కానుంది. మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ఇక ట్రయిలర్‌ విషయానికొస్తే.. ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ఆసక్తికరమైన కథనంతో పాటు హాలీవుడ్ స్థాయి మేకింగ్ క్వాలిటీ కనిపిస్తోంది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, విదేశాల్లో జరుగుతున్న నమ్మలేని వాస్తవాలపై కొత్త దృక్కోణాన్ని చూపనుంది. థ్రిల్, మిస్టరీ కలగలిపిన కథను ఆస్వాదించేందుకు మార్చి 21 వరకు ఎదురు చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories