Anasuya: రెచ్చగొట్టకు దమ్ముంటే స్టేజీపైకి రా.. అనసూయ మాస్‌ వార్నింగ్‌

Anasuya: రెచ్చగొట్టకు దమ్ముంటే స్టేజీపైకి రా.. అనసూయ మాస్‌ వార్నింగ్‌
x
Highlights

Anasuya: యాంకర్‌ అనసూయను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. న్యూస్‌ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది అనసూయ.

Anasuya: యాంకర్‌ అనసూయను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. న్యూస్‌ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది అనసూయ. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటే అనసూయ.. కాంట్రవర్సీలతో సావాసం చేస్తుంటుంది. ముఖ్యంగా తనను ఆంటీ అంటూ కామెంట్‌ చేసే వారిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హోళీ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో అనసూయ మాస్‌ వార్నింగ్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం (మార్చి 14న) హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొంది అనసూయ. హైదరాబాద్‌లోని ఓ హోలీ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వెళ్లిన ఆమెను ఓ ఆకతాయి ‘ఆంటీ’ అని పిలిచాడు. ఆ పిలుపు తన చెవిని తాకడంతో అనసూయకు చిర్రెత్తొచ్చింది. 'దమ్ముంటే స్టేజీపైకి రా" అని సవాల్ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూపిస్తా' అని ధమ్కీ ఇచ్చింది. "ఏంటి, భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు" అన్నట్లుగా సైగ చేసింది. ఇ

దీంతో ఈ అంశం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్కువ మంది నెటిజన్లు అనసూయకు మద్ధతుగా నిలుస్తున్నారు. న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ.. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘పుష్ప 1’, ‘పుష్ప 2’, ‘విమానం’, ‘ప్రేమ విమానం’, ‘రజాకార్’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ‘సూయ సూయ సూయ’, ‘పైన పటారం లోన లొటారం’, ‘వా వా మేరే బావా’ వంటి స్పెషల్‌ సాంగ్స్‌లోనూ నటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories