Shiva Jyothi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తీన్మార్ సావిత్రి.. శివజ్యోతి ఇంట సందడి

Shiva Jyothi
x

Shiva Jyothi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తీన్మార్ సావిత్రి.. శివజ్యోతి ఇంట సందడి

Highlights

Shiva Jyothi: టాలీవుడ్ బుల్లితెరపై తనదైన తెలంగాణ యాసతో, స్వచ్ఛమైన మాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ శివజ్యోతి ఇంట ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది.

Shiva Jyothi: టాలీవుడ్ బుల్లితెరపై తనదైన తెలంగాణ యాసతో, స్వచ్ఛమైన మాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ శివజ్యోతి ఇంట ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. గత కొన్నాళ్లుగా తన గర్భధారణకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, ఆ మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వచ్చిన ఈ బిగ్ బాస్ బ్యూటీ, తాజాగా ఒక శుభవార్తను అందజేసింది.

శివజ్యోతి, గంగూలీ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఫిబ్రవరి 12వ తేదీన శివజ్యోతి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.మా జీవితాల్లోకి మూడవ వ్యక్తి వచ్చారు.. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం అంటూ ఈ జంట ఎమోషనల్ అయ్యారు.

సాధారణంగా సెలబ్రిటీలు బిడ్డ పుట్టగానే బాబు లేదా పాప అని రివీల్ చేస్తారు. కానీ శివజ్యోతి మాత్రం ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. తమకు పుట్టిన బిడ్డ అమ్మాయా? లేక అబ్బాయా? అనే విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. త్వరలోనే బిడ్డ జెండర్‌ను రివీల్ చేస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

శివజ్యోతి మాతృత్వం పొందిందన్న వార్త తెలియగానే సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సావితక్కా.. కంగ్రాట్యులేషన్స్, నీలాగే బిడ్డ కూడా చాలా ధైర్యంగా, స్వచ్ఛంగా ఉండాలి అంటూ కామెంట్లతో ఆశీర్వదిస్తున్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, తన కష్టంతో, ప్రతిభతో యాంకర్‌గా ఎదిగి.. ఇప్పుడు ఒక తల్లిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన శివజ్యోతికి అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories