Andhra King Taluka Review : స్టార్ హీరోలకి, వాళ్ళ ఫ్యాన్స్‌కి కనెక్ట్ అయ్యే హార్ట్‌ఫుల్ డ్రామా..తప్పక చూడాల్సిన వీకెండ్ మూవీ

Andhra King Taluka Review : స్టార్ హీరోలకి, వాళ్ళ ఫ్యాన్స్‌కి కనెక్ట్ అయ్యే హార్ట్‌ఫుల్ డ్రామా..తప్పక చూడాల్సిన వీకెండ్ మూవీ
x

Andhra King Taluka Review : స్టార్ హీరోలకి, వాళ్ళ ఫ్యాన్స్‌కి కనెక్ట్ అయ్యే హార్ట్‌ఫుల్ డ్రామా..తప్పక చూడాల్సిన వీకెండ్ మూవీ

Highlights

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా

Andhra King Taluka Review : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పచ్చిగొల్ల తెరకెక్కించిన ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ అండగా నిలవడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

కథ

ఈ సినిమా ముఖ్యంగా ఒక స్టార్ హీరోకు (ఉపేంద్ర), ఆ హీరోను దేవుడిగా భావించే ఒక వీరాభిమాని (రామ్ పోతినేని) మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని చూపిస్తుంది. అభిమాని ప్రపంచం, వాళ్ల జీవితం, ఆశయాలు.. తమ ఆరాధ్య నటుడితో ఎలా ముడిపడి ఉంటాయో దర్శకుడు నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు.

నటీనటుల పర్ఫామెన్స్

రామ్ నటనకు ప్రశంసలు దక్కాయి. మాస్ యాక్షన్ నుంచి కాస్త పక్కకు వచ్చి, ఎమోషనల్ కోర్‌ ఉన్న పాత్రను నిజాయితీగా పోషించాడు. ఈ సినిమా రామ్‌కు కెరీర్ బెస్ట్ అని, తన పాత్రను బాగా పండించాడని విశ్లేషకులు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత రామ్‌కు దక్కిన డీసెంట్ ఫిల్మ్ ఇదేనని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉపేంద్ర ఆంధ్ర కింగ్ సూర్య పాత్రలో చాలా డెప్త్ ఉన్న నటనను కనబరిచారు. ఆయన పాత్ర, నటన సినిమాకు ఒక సెంట్రల్ స్ట్రెంత్‌గా నిలిచింది. రావు రమేష్, మురళీ శర్మ వంటి నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు బలాన్నిచ్చారు. ముఖ్యంగా రావు రమేష్‌పై వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. హీరోయిన్ భాగ్యశ్రీతో రామ్ కెమిస్ట్రీ కూడా ఫ్రెష్‌గా, అందంగా ఉంది.

ప్లస్ పాయింట్స్

హీరో-అభిమాని మధ్య సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. ప్రతి అభిమాని తన జీవితానికి కనెక్ట్ చేసుకునేలా సినిమాను తీర్చిదిద్దారు. అందుకే ఇది ప్రతి ఫ్యాన్‌కి బయోపిక్ లాంటిది అని కొందరు అంటున్నారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉన్నా, సెకండాఫ్ మాత్రం పూర్తిగా ఎమోషనల్‌గా మారుతుంది. చివరి 30-40 నిమిషాల క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించి, కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది. వరదలు ముంచెత్తే సీక్వెన్స్ కూడా బాగా తీశారని ప్రశంసలు దక్కాయి.

దర్శకుడు మహేష్ బాబు పచ్చిగొళ్ల సాలిడ్ రైటింగ్, స్ట్రాంగ్ డైలాగ్స్ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచాయి. ఇవి ఆలోచింపజేసేలా ఉన్నా, ఎక్కడా బోర్ కొట్టకుండా, నిజాయితీగా అనిపించాయి. అలాగే వివేక్-మెర్విన్ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటలు సోల్‌ఫుల్‌గా ఉండి, ఎమోషన్స్‌ను మరింత పెంచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, సినిమాను అత్యున్నత స్థాయిలో నిర్మించారు.

మైనస్ పాయింట్స్

సినిమా నిడివి ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా తొలి అరగంటలో కథనం కాస్త స్లోగా సాగడం. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఉంది. కథనం కొన్ని చోట్ల ముందే ఊహించగలిగేలా ఉంది.

ఓవరాల్‎గా

ఆంధ్ర కింగ్ తాలూకా ఒక భావోద్వేగమైన, నిజాయితీతో కూడిన సినిమా. రామ్ పోతినేని కెరీర్‌లో ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. ముఖ్యంగా ఉపేంద్ర-రామ్ మధ్య సెంటిమెంట్, పదునైన మాటలు, ఎమోషనల్ సెకండ్ హాఫ్ ఈ సినిమాను నిలబెడతాయి. కొన్ని ల్యాగ్స్ ఉన్నా, సినిమా ఇచ్చే పాజిటివ్ అనుభూతి కారణంగా ఇది తప్పకుండా చూడదగినది. ఫ్యామిలీ ఆడియన్స్, ఫిల్మీ యూత్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యి, మంచి హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రేటింగ్ : 3.25 / 5

Show Full Article
Print Article
Next Story
More Stories