Ari Movie : ఏడేళ్ల కష్టం ఫలించింది.. అరి దర్శకుడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు

Ari Movie
x

Ari Movie : ఏడేళ్ల కష్టం ఫలించింది.. అరి దర్శకుడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు

Highlights

Ari Movie : పేపర్ బాయ్ వంటి సున్నితమైన ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు జయశంకర్, తాజాగా అరి అనే వినూత్న చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Ari Movie : పేపర్ బాయ్ వంటి సున్నితమైన ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు జయశంకర్, తాజాగా అరి అనే వినూత్న చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. మీడియా సమీక్షల నుంచి సోషల్ మీడియా వరకు, ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా దర్శకుడిని అభినందించడం అరి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన అరి సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దర్శకుడు జయశంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయశంకర్ ఏడేళ్ల కష్టం ఈ సినిమా ద్వారా ఫలించిందని, అరి సాధించిన విజయం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రమంత్రి అభినందించడం చిత్ర యూనిట్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

అరి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథాంశం, దర్శకుడు అందించిన సందేశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు దర్శకుడు జయశంకర్ ప్రేక్షకులను లీనం చేస్తూ సన్నివేశాలను నడిపిన విధానాన్ని ప్రేక్షకులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ వారం విడుదలైన సినిమాలలో అరి కాస్త ముందుంది అని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో నటీనటుల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా, వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలలో జీవించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పాత్రలన్నీ ప్రేక్షకులకు భావోద్వేగాల పరంగా కనెక్ట్ అయ్యాయి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం అరి సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఆయన సంగీతం సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రంలోని డైలాగులు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు జయశంకర్ తన రెండవ అడ్డంకిని అరి చిత్రంతో విజయవంతంగా దాటారని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories