Ari movie: పదో రోజూ ‘అరి’ దెబ్బ మామూలుగా లేదు! దీపావళి చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్న కంటెంట్ బేస్డ్ సినిమా!

Ari movie: పదో రోజూ ‘అరి’ దెబ్బ మామూలుగా లేదు!  దీపావళి చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్న కంటెంట్ బేస్డ్ సినిమా!
x
Highlights

థియేటర్లలో దర్శకుడు జయ శంకర్ సంబరం.. కొత్త రిలీజ్‌లైనా తగ్గని ‘అరి’ జోరు!

Ari movie: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా వారం రోజులు ఆడితేనే గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో, చిన్న సినిమా ‘అరి’ అద్భుతం సృష్టిస్తోంది. పెద్ద చిత్రాలు కూడా వీకెండ్‌కే హవా చూపించే రోజుల్లో, గత వారం విడుదలైన చిత్రాల్లో ‘అరి’ మూవీ రెండో వారంలోకి సగర్వంగా అడుగుపెట్టింది.

కొత్త చిత్రాలతోనూ కంటిన్యూ!

ఈ వారం దీపావళి సీజన్‌ను పురస్కరించుకుని నాలుగు కొత్త చిత్రాలు (మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కే ర్యాంప్) బరిలోకి దిగాయి. అయినప్పటికీ, ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలైన ‘అరి’ తన సూపర్ టాక్ కారణంగా రెండో వారంలో కూడా థియేటర్లలో కొనసాగుతోంది. మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా మెల్లిగా పుంజుకుంటోందని సమాచారం.

కొత్త చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చేలా ‘అరి’ కనిపిస్తోంది. పదో రోజు కూడా సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పదో రోజు తాను థియేటర్‌లో సినిమా చూస్తున్నట్టుగా జయ శంకర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘అరిషడ్వర్గాల’ కాన్సెప్ట్ అదుర్స్

‘పేపర్ బాయ్’ లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన జయ శంకర్.. ఇప్పుడు ‘అరి’తో మరో అడుగు ముందుకేశాడు. ఇప్పటివరకు రాని అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను తీసుకుని, ప్రస్తుత సమాజానికి అవసరమయ్యే మంచి సందేశాన్ని ఇస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలోని క్లైమాక్స్, చివరి నిమిషాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతోనే రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు నిర్ణయించారు. అయితే, నటీనటులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోషన్లు చేస్తే సినిమా ఆడియెన్స్‌లోకి మరింతగా వెళ్లే అవకాశం ఉండేది. ఈ రెండో వారంలోనైనా మేకర్లు ప్రమోషన్లపై దృష్టి పెట్టి, సినిమాను మరింతగా ప్రేక్షకులకు చేరువ చేస్తారేమో చూడాలి.

వరుసగా రెండు అద్భుతమైన కంటెంట్ బేస్డ్ సినిమాలను అందించిన జయ శంకర్, తన రాబోయే మూడో చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories