ఉపరాష్ట్రపతి ప్రశంసలు, కేంద్ర మంత్రి అభినందనలు.. అరి చిత్రం ఎందుకంటే స్పెషల్ ?

ఉపరాష్ట్రపతి ప్రశంసలు, కేంద్ర మంత్రి అభినందనలు.. అరి చిత్రం ఎందుకంటే స్పెషల్ ?
x

ఉపరాష్ట్రపతి ప్రశంసలు, కేంద్ర మంత్రి అభినందనలు.. అరి చిత్రం ఎందుకంటే స్పెషల్ ?

Highlights

టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథలాజికల్ అంశాలు, దైవత్వం ప్రధానంగా సాగే డివైన్ ట్రెండ్ నడుస్తోంది. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలు ఈ ట్రెండ్‌ను విజయవంతం చేశాయి.

టాలీవుడ్‌లో ప్రస్తుతం మైథలాజికల్ అంశాలు, దైవత్వం ప్రధానంగా సాగే డివైన్ ట్రెండ్ నడుస్తోంది. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలు ఈ ట్రెండ్‌ను విజయవంతం చేశాయి. తాజాగా, ఇదే కోవలో ఆడియెన్స్ ముందుకు వచ్చిన చిత్రం అరి. పేపర్ బాయ్ దర్శకుడు వి. జయశంకర్ ఏడేళ్ల పరిశోధనతో రూపొందించిన ఈ చిత్రం, ఏ భారతీయ సినిమాలోనూ టచ్ చేయని అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం) అనే గూఢమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

అక్టోబర్ 10న విడుదలైన అరి చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల నుండి అనూహ్య స్పందనను అందుకుంటోంది. సినిమాలోని విలక్షణమైన కథాంశం, భావోద్వేగ లోతుతో పాటు, దర్శకుడు ఇచ్చిన సామాజిక సందేశానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాను వీక్షించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీనిని ఆధునిక భగవద్గీత అని వ్యాఖ్యానించడం సినిమా గొప్పతనాన్ని తెలియజేసింది. అంతేకాకుండా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్‌ను వ్యక్తిగతంగా అభినందించడం ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది.

అరి సినిమాలో కామం, క్రోధం, లోభం వంటి ఆరు అంతర్గత శత్రువులను ఆరు వేర్వేరు పాత్రల ద్వారా దర్శకుడు చూపించారు. వీరి కథలు చివరికి ఏడో అంశం - శ్రీకృష్ణుడి దైవ ఉనికి వద్ద కలుస్తాయి. ముఖ్యంగా, సినిమా చివరి 20 నిమిషాల్లో కృష్ణుడి పాత్ర ఎంట్రీ ఇవ్వడం, అరిషడ్వర్గాల గురించి ఆయన ఇచ్చే సందేశం ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ ఆధ్యాత్మిక క్లైమాక్స్ గురించే మీడియా, సోషల్ మీడియా, సినీ విమర్శకులు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

విడుదలకు ముందే అరి చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆఫ్టర్‌లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, స్వీడన్ ఫిల్మ్ అవార్డ్స్‌తో సహా ఏకంగా ఆరు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను ఈ సినిమా దక్కించుకుంది. నటీనటుల విషయానికి వస్తే, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వినోద్ వర్మ, వైవా హర్ష వంటి అనుభవం ఉన్న నటులందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రతి పాత్ర అరిషడ్వర్గాలలో ఒక భాగాన్ని ప్రతిబింబిస్తూ కథనానికి బలం చేకూర్చింది.

పేపర్ బాయ్ వంటి మంచి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వి. జయశంకర్, ఏడేళ్ల సుదీర్ఘ పరిశోధన, వ్యక్తిగత కష్టాల మధ్య కూడా అరి వంటి డీప్ ఫిలసాఫికల్ చిత్రాన్ని అందించారు. ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాకుండా, మనిషిలోని లోపాలను ప్రశ్నించే తత్వాన్ని, లోతైన సందేశాన్ని అందించిందని విమర్శకులు పేర్కొంటున్నారు. మొత్తానికి అరి చిత్రం బలమైన కంటెంట్‌తో, అద్భుతమైన భావోద్వేగ ప్రయాణంతో, ఈ సీజన్‌లో అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories