‘అర్జున్ చక్రవర్తి’ థియేటర్స్‌లో తప్పక చూడాల్సిన అద్భుతమైన సినిమా: డైరెక్టర్ విక్రాంత్ రుద్ర థాంక్ యూ మీట్‌లో స్పందన


విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
థాంక్ యూ మీట్లో డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. చాలా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇంకా చాలామంది సినిమా చూడలేదు. తప్పకుండా ఈ సినిమా చూడాలని, మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ప్రోత్సహిస్తేనే, ప్రేక్షకులు ఆదరిస్తేనే మా అందరికీ మరో సినిమా తీయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది. ప్రేక్షకులు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే ఇలాంటి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి .సినిమాకి అద్భుతమైన రివ్యూస్ ఇచ్చిన మీడియా వారందరికీ ధన్యవాదాలు. మా నిర్మాత శ్రీని గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమాలు తీశారు. మా టీం లేకపోతే ఈ సినిమా ముందుకు వచ్చేది కాదు. టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా హీరో గురించి, మా నిర్మాత గురించి చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. విజయ్ ఆరేళ్లపాటు ఈ సినిమాకి డెడికేటెడ్ గా పనిచేశారు. తప్పకుండా సినిమా చూడండి. దయానంద్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది సిజా. చాలా అద్భుతంగా నటించింది. మాకు సపోర్ట్ చేసిన హనురాఘవపూడి గారికి, వెట్రిమారన్ గారికి, అడవి శేష్ గారికి, సంపత్ నంది గారికి, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అందరూ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
హీరో విజయరామరాజు మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆరు సంవత్సరాల కష్టానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు సపోర్ట్ చేసిన హనురాఘవపూడి గారికి, వెట్రిమారన్ గారికి, అడివి శేష్ గారికి, సంపత్ నంది గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పెర్ఫార్మన్స్ చేశాను అంటే ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి దక్కుతుంది. మా నిర్మాత శ్రీని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. నేను ఎంత కష్టపడినా మా వెనక ఉండి ఒక కొండంత ధైర్యంతో నడిపించారు. ఒక సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి ఎంత కష్టపడాలో అందరికీ తెలుసు. ఆరేళ్లుగా మా నిర్మాత ఈ సినిమా బరువుని మోసారు. ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన జీవితాంతం నా గుండెల్లో ఉంటారు. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమా చూసామనే అనుభూతి కలుగుతుంది.
హీరోయిన్ సిజా రోజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి తెలుగు సినిమా ఇంత మంచి అద్భుతమైన రివ్యూస్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దేవిక పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మాత శ్రీని గారు ఈ సినిమాని గ్రేట్ విజన్ తో నిర్మించారు. విజయ్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా థియేటర్స్ లో చూసి ఇంకా పెద్ద విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను.
నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, మేము ఇన్స్టాగ్రామ్ లో చేసిన సర్వే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే అయ్యాయి. ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాను. యుఎస్ లో ఇండియాలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
యాక్టర్ దయానంద్ రెడ్డి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్తున్నారు. దాదాపు వంద సినిమాలు చేశాను. అన్ని సినిమాల్లో కల్లా ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇందులో రంగయ్య క్యారెక్టర్ నా కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాని, ఈ క్యారెక్టర్ అద్భుతంగా మలిచిన డైరెక్టర్ గారికి, పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ థాంక్ యూ మీట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire