Baahubali - The Epic : 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ సినిమా కొత్త అవతారం..మళ్లీ థియేటర్లలో దద్దరిల్లనున్న మహిష్మతి

Baahubali - The Epic : 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ సినిమా కొత్త అవతారం..మళ్లీ థియేటర్లలో దద్దరిల్లనున్న మహిష్మతి
x

Baahubali - The Epic : 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ సినిమా కొత్త అవతారం..మళ్లీ థియేటర్లలో దద్దరిల్లనున్న మహిష్మతి

Highlights

Baahubali - The Epic: భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన బాహుబలి చిత్రం విడుదలై పదేళ్లు పూర్తైన సందర్భంగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అభిమానులకు అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చారు.

Baahubali - The Epic: భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన బాహుబలి చిత్రం విడుదలై పదేళ్లు పూర్తైన సందర్భంగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అభిమానులకు అదిరిపోయే సర్​ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా రెండు భాగాలైన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ లోని ముఖ్య ఘట్టాలను, హైలైట్ పాయింట్లను కలిపి, కొత్తగా బాహుబలి - ది ఎపిక్ పేరుతో రూపొందించారు. ఈ ఎపిక్ వెర్షన్ అక్టోబర్ 31, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, మేకర్స్ తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను మరోసారి మహిష్మతి సామ్రాజ్యపు ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

బాహుబలి - ది ఎపిక్ ట్రైలర్‌ను సినిమా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో విడుదల చేశారు. ఇది అభిమానులలో అంచనాలను అమాంతం పెంచింది. ఈ ట్రైలర్ అమరేంద్ర బాహుబలి (ప్రభాస్), భల్లాలదేవ (రానా దగ్గుబాటి), శివగామి (రమ్యకృష్ణ), కట్టప్ప (సత్యరాజ్), దేవసేన (అనుష్క శెట్టి) సహా ఇతర కీలక పాత్రలన్నింటినీ మళ్ళీ పరిచయం చేసింది. ఈ ఎపిక్ వెర్షన్, మొదటి భాగం బాహుబలి: ది బిగినింగ్, రెండవ భాగం బాహుబలి: ది కంక్లూజన్‎లోని ప్రధాన సంఘటనలను చాలా సహజంగా కలిపి, ప్రేక్షకులకు ఒకే కథా అనుభూతిని అందిస్తుంది.




రెండు సినిమాల ప్రధాన ఘట్టాలను కలిపి రూపొందించిన ఈ బాహుబలి - ది ఎపిక్ కొత్త ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, మేకర్స్ రెండు సినిమాలు, ఒక ఎపిక్ అనుభవం! ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి - ది ఎపిక్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా అక్టోబర్ 31, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ కొత్త ఎపిక్ వెర్షన్ మొత్తం రన్​టైమ్ ) సుమారు 3 గంటల 40 నిమిషాలకు పైగా ఉండవచ్చని సమాచారం. ఈ విధంగా సినిమాను చూడటం అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

బాహుబలి నిర్మాణం తర్వాత, మూడవ భాగం బాహుబలి 3 వస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, దీనిపై నిర్మాత కీలక క్లారిటీ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో బాహుబలి 3 గురించి నిర్మాత శోభు యార్లగడ్డను అడగగా, బాహుబలి 3 ఇప్పట్లో రాదు. భవిష్యత్తులో మరికొన్ని సర్​ప్రైజ్‌లు ఉండొచ్చు, కానీ బాహుబలి 3 కోసం ఇంకా చాలా వర్క్ జరగాల్సి ఉంది అని అభిమానులకు స్పష్టం చేశారు. ఈ సినిమా వల్ల ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి నటీనటుల కెరీర్లు పూర్తిగా మారిపోయాయి. అక్టోబర్ 31న ఈ మహాగాథను కొత్త రూపంలో చూడటం ప్రేక్షకులకు పండుగలాంటిదే.

Show Full Article
Print Article
Next Story
More Stories