Bahubali: బాహుబలి టీమ్‌ రీయూనియన్‌ !

Bahubali: బాహుబలి టీమ్‌ రీయూనియన్‌ !
x

Bahubali: బాహుబలి టీమ్‌ రీయూనియన్‌ !

Highlights

భారత సినీ చరిత్రను మార్పు చేసిన సినిమా ‘బాహుబలి’ విడుదలై నేటితో దశాబ్దం పూర్తైంది. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా తెరకెక్కిన ఈ విజువల్ మాస్టర్‌పీస్‌ జూలై 10, 2015న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారత సినీ చరిత్రను మార్పు చేసిన సినిమా ‘బాహుబలి’ విడుదలై నేటితో దశాబ్దం పూర్తైంది. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా తెరకెక్కిన ఈ విజువల్ మాస్టర్‌పీస్‌ జూలై 10, 2015న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటినుంచి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులను దోచుకుంది.

ఈ స్పెషల్ డే సందర్భంగా బాహుబలి టీమ్ మళ్లీ ఒక్కటైంది. రాజమౌళి, ప్రభాస్, రానా, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నిర్మాత శోభు యార్లగడ్డ, వీఎఫ్ఎక్స్ మాస్టర్ కణల్ కణ్ణన్, కీరవాణి భార్య శ్రీవల్లి, రాజమౌళి భార్య రమా – అందరూ కలిసి ఈ ప్రత్యేక సందర్భంగా సమావేశమయ్యారు.

అయితే సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాత్రం, తన తండ్రి మరణం కారణంగా ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. ఈ రీయూనియన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బాహుబలి తొలి భాగం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో పాటు, సీక్వెల్ అయిన ‘బాహుబలి 2’ అప్పటి రికార్డులను తుడిచిపెట్టేసిన విషయం తెలిసిందే.

ఈ రీయూనియన్‌, బాహుబలి సినిమాకి భారతీయ సినీ ప్రాంగణంలో ఉన్న స్థానం ఎంత గొప్పదో మరోసారి రుజువు చేసింది.Bahubali Reunion: Celebrating 10 Years of the Epic Blockbuster

Show Full Article
Print Article
Next Story
More Stories