Mokshagna: "ఆదిత్య 369" సీక్వెల్ తో ఎంట్రీ ఇస్తున్న బాలయ్య తనయుడు

Sandeep Reddy
Published on: 21 July 2021 1:35 PM IST
Balakrishna Announced His Son Mokshagna Will Enter Movies With Aditya 369 Sequel Movie
X

బాలకృష్ణ - మోక్షజ్ఞ

Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించాడు. ఇటీవలే "ఆదిత్య 369" సినిమా 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆ సినిమాకి సీక్వెల్ గా నందమూరి మోక్షజ్ఞ హీరోగా "ఆదిత్య 999 మాక్స్" సినిమాని 2023 లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. ఇప్పటికే కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నానని, అవసరం అయితే ఆ సినిమాకి తానే దర్శకత్వం కూడా వహిస్తానని బాలయ్య తెలిపాడు. గతంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై పలు వార్తలు వచ్చిన స్పందించని బాలయ్య తాజాగా "ఆదిత్య 999 మాక్స్" సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడని స్వయంగా చెప్పాడు.

సైంటిఫిక్ ఫిక్షన్ గా తెరకేక్కబోతున్న ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఇప్పటికే పలువు ప్రముఖ నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 26 ఏళ్ళ వయస్సు ఉన్న మోక్షజ్ఞ నందమూరి హీరోగా బాలయ్య వారసుడిగా రానున్న కాలంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే. ఇక మరో పక్క బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" చిత్రంలో నటించడంతో పాటు త్వరలోనే పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో రెండు చిత్రాల్లో నటించబోతున్నాడు. బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నడనే వార్త తెలియగానే అటు బాలయ్య బాబు అభిమానులతో పాటు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story