Balakrishna: దేవా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పిన బాలకృష్ణ

Balakrishna: సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలకు కృతజ్ఞతలు

Jyothi
Published on: 15 Jan 2023 1:31 PM IST
Balakrishna Apology to Deva Brahmins
X

Balakrishna: దేవా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పిన బాలకృష్ణ

Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణ దేవ బ్రాహ్మణ కులస్తులకు క్షమాపణలు చెప్పారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నందమూరి బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. సోదరసోదరీమణులకు మీ సోదరుడు బాలకృష్ణ అంటూ ఆయన ఓ ప్రకటన ఇచ్చారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బాలకృష్ణ తెలిపారు. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానని నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదన్న బాలకృష్ణ.. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో వచ్చిన మాట మాత్రమేనని... అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల తనకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అని వివరణ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story