OTT: గజగజ వణికించే 8 స్కామ్ థ్రిల్లర్స్... ఒక్కో సీన్‌లో షాక్‌కి గురిచేస్తాయి! ఇంత ఈజీగా మోసం చేస్తారా...

OTT: గజగజ వణికించే 8 స్కామ్ థ్రిల్లర్స్... ఒక్కో సీన్‌లో షాక్‌కి గురిచేస్తాయి! ఇంత ఈజీగా మోసం చేస్తారా...
x

OTT: గజగజ వణికించే 8 స్కామ్ థ్రిల్లర్స్... ఒక్కో సీన్‌లో షాక్‌కి గురిచేస్తాయి! ఇంత ఈజీగా మోసం చేస్తారా...

Highlights

ఓటీటీలో రియల్ లైఫ్ స్కామ్‌లపై ఆధారపడి తీసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కొన్నిసార్లు నిజ జీవితంలో జరిగిన మోసాలు, కుంభకోణాలు సినిమా కథల కంటే కూడా ఎక్కువ షాకింగ్‌గా ఉంటాయి. అలాంటి స్కామ్ స్టోరీస్‌ని తెరపైకి తీసుకువచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.

స్కామ్ 1992:

90లలో భారత స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా స్కామ్‌ను ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అద్భుతమైన కథనంతో రియల్ లైఫ్ స్కామ్‌లకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది.

ది యాక్ట్ (The Act):

గిప్సీ రోజ్ బ్లాన్‌చార్డ్ నిజజీవిత కథ ఆధారంగా తీసిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తల్లి డీ డీ కూతురికి అబద్ధంగా జబ్బులు ఉన్నాయని చెబుతూ ప్రజల నుంచి డొనేషన్లు తీసుకుంటుంది. చివరికి ఆ అబద్ధం ఆమె ప్రాణానికే కారణమైంది.

ఇన్వెంటింగ్ అన్నా (Inventing Anna):

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ అన్నా సోరోకిన్ అనే మహిళ కథ. అన్నా డెల్వే అనే పేరుతో జర్మన్ ధనవంతురాలిగా నటించి, బ్యాంకులు, హోటళ్లు, పెద్దల నుంచి లక్షల డాలర్లు మోసగట్టింది.

ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ (The Wolf of Wall Street):

లియోనార్డో డికాప్రియో నటించిన ఈ సినిమా జోర్డాన్ బెల్ఫోర్ట్ అనే స్టాక్ బ్రోకర్ రియల్ లైఫ్ ఆధారంగా తీసింది. అతడు పంప్ అండ్ డంప్ స్కీమ్ ద్వారా బిలియన్ల డాలర్లు సంపాదించాడు. ప్రస్తుతం అతను మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాడు.

ఫైర్: ది గ్రేటెస్ట్ పార్టీ దట్ నెవర్ హ్యాపెండ్ (Fyre: The Greatest Party That Never Happened):

నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యమవుతున్న ఈ డాక్యుమెంటరీ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ మోసాన్ని చూపిస్తుంది. ఫుల్ డిమాండ్‌తో టికెట్లు అమ్మినా.. అక్కడ బేసిక్ సదుపాయాలు కూడా లేకపోవడంతో ఈవెంట్ పూర్తిగా విఫలమైంది.

ది టిండర్ స్విండ్లర్ (The Tinder Swindler):

డేటింగ్ యాప్ ద్వారా మహిళలను మోసగట్టిన సైమన్ లెవివ్ నిజజీవిత కథ ఆధారంగా తీసిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అతను కోట్ల రూపాయలు మోసం చేశాడు.

ఇతర స్కామ్ స్టోరీస్:

క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ (Catch Me If You Can):

చిన్న వయసులోనే పైలట్, డాక్టర్, లాయర్‌లా నటించి మోసాలు చేసిన ఫ్రాంక్ అబగ్నేల్ జూనియర్ స్టోరీ. (అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది)

ది బ్లింగ్ రింగ్ (The Bling Ring):

సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు చేసిన టీనేజర్ల కథ. (ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది)

బాడ్ వేగన్:

ఫేమ్, ఫ్రాడ్, ఫ్యుగిటివ్స్ (Bad Vegan: Fame Fraud Fugitives): రెస్టారెంట్ యజమాని సార్మా మెల్న్‌గైలిస్ జీవితాన్ని కూలదోసిన మోసం కథ. (నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం)

రియల్ లైఫ్ మోసాల ఆధారంగా తీసిన ఈ సిరీస్‌లు, సినిమాలు ఒక్కో సీన్‌కి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories