"భీమ్లా నాయక్" ఆఖరి షెడ్యూల్ కి ముహూర్తం సెట్..

Bheemla Nayak Momentum Set For Final Schedule
x

"భీమ్లా నాయక్" ఆఖరి షెడ్యూల్ కి ముహూర్తం సెట్...

Highlights

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటికే "ఆర్ఆర్ఆర్", "రాధే శ్యామ్" వంటి భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉండగా ఈ సినిమా విడుదలను కూడా వాయిదా వేశారు. దీంతో సినిమా పనులను మెల్లగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇంకా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని పోర్షన్ లు మిగిలి ఉన్నాయట. సినిమా షూటింగ్ షెడ్యూల్ లో అన్నిటినీ పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్లో జనవరి 25 నుంచి మొదలవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాని ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి భారత దేశంలో కరోనా కేసులు తగ్గుతాయని నమ్ముతోంది చిత్ర బృందం. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా కూడా హీరోగా నటిస్తున్నారు. సినిమా కథ మొత్తం పవన్ కళ్యాణ్ మరియు రానా పాత్రల చుట్టూ తిరుగుతుంది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా లో బ్రహ్మానందం మరియు మురళి శర్మ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories