Bigg Boss 8 Telugu: సీత మాటలకు హర్ట్ అయిన నిఖిల్.. ఆమెకు ఓటు వేయకండని రిక్వెస్ట్
నాగార్జున ముందు నుంచి చెప్తున్నట్లు ఈసారి బిగ్‌బాస్ భిన్నంగా సాగుతోంది. ముఖ్యంగా 12వారం ఎలిమినేషన్‌కు సంబంధించి నిర్వాహకులు కొత్త విధానాన్న...
నాగార్జున ముందు నుంచి చెప్తున్నట్లు ఈసారి బిగ్‌బాస్ భిన్నంగా సాగుతోంది. ముఖ్యంగా 12వారం ఎలిమినేషన్‌కు సంబంధించి నిర్వాహకులు కొత్త విధానాన్న అవలంబిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన వారు మళ్లీ వచ్చి నామినేట్ చేస్తున్నారు. బయటకు వెళ్లిన వారు ఒక్కొక్కరు మళ్లీ వచ్చి తాము ఎవరిని నామినేట్ చేస్తున్నాం. ఎందుకు నామినేట్ చేస్తున్నామన్న వివరాలను వెల్లడిస్తున్నారు.
అయితే ఇది పెద్ద రచ్చకు దారి తీస్తుంది. తాము ఎందుకు నామినేట్ చేస్తున్నారనే విషయాన్ని తెలిపే సమయంలో కొందరు చేసే కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. తాజాగా నిఖిల్‌పై సోనియా, సీతా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సీతా చేసిన ఆరోపణలతో నిఖిల్ ఓ రేంజ్లో హర్ట్ అయ్యాడు. స్ట్రాంగ్ ఉమెన్ను వాడుకుని.. వాళ్లను గేమ్ ఆడకుండా చేసి నిఖిల్ గెలవాలని చూస్తాడన్న సీత వ్యాఖ్యలపై నిఖిల్ ఫీలయ్యాడు.
సీత ఈ వ్యాఖ్యలు చేసి వెళ్లిన తర్వాత చాలా సేపు ఒంటరిగా కూర్చొని బాధపడ్డాడు. యష్మీ దగ్గర ఇదే పాయింట్ తీస్తూ చాలాసేపు డిస్కస్ చేశాడు. గేమ్ పరంగా నిన్ను వాడుకున్నానా అని నిఖిల్ అడగ్గా.. అందుకు యష్మీ లేదని బదులిచ్చింది. మరి సీత చెప్తున్నప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు, థ్యాంక్స్ అని ఎందుకు చెప్పావ్ అంటూ యష్మిని నిఖిల్ ప్రశ్నించగా.. పానీపట్టు టాస్కుకు ఎఫర్ట్స్ కనిపించలేదు.. కానీ నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడుతుంది మాకు కనిపిస్తుంది అందుకు థాంక్స్ చెప్పాను అంటూ యష్మీ కవర్ చేసింది.
ఇక యష్మీ అక్కడి నుంచి వెళ్లిపోయాక.. నిఖిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెమెరా ముందుకు వచ్చిన తనకు ఓటు వేయకండని ప్రేక్షకులను కోరాడు. నామినేషన్లలో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ ఉమెన్ ను వాడుకొని నేను గేమ్ లో గెలవాలని అనుకోలేదని ప్రేక్షకులకు తెలిపారు. మనసుకి ఏం అనిపిస్తుందో అలాగే ఆడానని.. ఒకరిని తొక్కి వాడుకొని ఈ షో గెలవాలని తాను రాలేదని తనకు ఇప్పటి వరకు ఓట్లు వేసిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు వెళ్లిపోవాలనిపిస్తుందని, ప్రయాణం అయిపోయిందంటూ ఓట్లు వేయకండి వాపోయాడు. మరి ఈ వారం నిఖిల్‌కు ప్రేక్షకులు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire