Biggboss : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపేందుకు పోరాటం..డ్రాయింగ్, వెయిట్ టాస్క్‌లలో పవన్-రీతూ హవా

Biggboss : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపేందుకు పోరాటం..డ్రాయింగ్, వెయిట్ టాస్క్‌లలో పవన్-రీతూ హవా
x

Biggboss : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపేందుకు పోరాటం..డ్రాయింగ్, వెయిట్ టాస్క్‌లలో పవన్-రీతూ హవా

Highlights

బిగ్ బాస్ సీజన్ 9, 32వ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిచింది.

Biggboss : బిగ్ బాస్ సీజన్ 9, 32వ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిచింది. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు, డేంజర్ జోన్‌లో ఉన్న 10 మంది కంటెస్టెంట్లను ఐదు జంటలుగా విభజించి బిగ్ బాస్ టాస్క్‌లు పెడుతున్నారు. నిన్నటి టాస్క్‌లలో ఫౌల్ గేమ్ ఆడినందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్‌లను గట్టిగా హెచ్చరించి, కొన్ని జంటల పాయింట్లలో సగం కోత విధించారు. తాజా ఎపిసోడులో మొదట జరిగిన డ్రాయింగ్ టాస్క్‌లో నాలుగు రౌండ్లలో భరణి-దివ్య, సంజన-ఫ్లోరా, సుమన్-శ్రీజ, పవన్-రీతూ జంటలు విజేతలుగా నిలిచాయి. అయితే, కల్యాణ్-తనూజ జంట మాత్రం ఏ పాయింట్ దక్కించుకోలేక నిరాశ చెందారు.

తరువాత వచ్చిన వెయిట్ హోల్డింగ్ టాస్క్ లో ప్రతి జంట బరువులు పట్టుకుంటూ చివరి వరకు నిలబడాలి. ఈ టాస్క్‌కి ఇమ్మానుయేల్, రాము సంచాలకులుగా వ్యవహరించారు. హోల్డ్ ఇట్ లాంగ్ పేరుతో జరిగిన ఈ టాస్క్‌లో తమ శక్తిని ప్రదర్శించి పవన్-రీతూ జంట అందరినీ మించిపోయి విజేతలుగా నిలిచింది. సంజన-ఫ్లోరా జంట బరువులను మోయడానికి చాలా కష్టపడింది.

రెండు టాస్క్‌ల్లోనూ ఓడిపోయి లీస్ట్ స్కోర్ (30 పాయింట్లు) తో ఉండటంతో తనూజ తీవ్ర భావోద్వేగానికి లోనై, తన పార్టనర్ కల్యాణ్‌పై ఎమోషనల్ రియాక్షన్ ఇచ్చింది. ఈ ఘటన హౌస్‌లో కొంత నిశ్శబ్దాన్ని తెచ్చింది. ఆ తర్వాత లీస్ట్ స్కోర్‌లో ఉన్న రెండు జంటలైన తనూజ-కల్యాణ్, సుమన్-శ్రీజ లలో ప్రతి జంట నుండి ఒకరిని వరెస్ట్ ప్లేయర్గా ఎంపిక చేయాలని బిగ్ బాస్ మిగతా హౌస్‌మేట్స్‌కు టాస్క్ ఇచ్చాడు. చాలా మంది హౌస్‌మేట్స్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఎపిసోడ్‌లోనే ముఖ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంఘటన దివ్య, శ్రీజ మధ్య జరిగిన ఘర్షణ. స్ట్రాటజీ పరంగా శ్రీజ వరెస్ట్ ప్లేయర్ అని దివ్య అభిప్రాయం చెప్పడంతో, ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వీరిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి, హౌస్ మొత్తం గోలగోలగా మారింది. దివ్య, శ్రీజ గురించి మాట్లాడుతూ.. తాను గెలవడం కోసం, ఫస్ట్ రావడం కోసం అందరిని ముంచేస్తుంది అంటూ ఆరోపించింది.

గతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి హౌస్‌మేట్స్‌ను గమనించిన దివ్య.. అప్పుడే శ్రీజ హౌస్‌లో ఉన్న వాళ్లని ప్రభావితం చేస్తుందని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్‌తో వీరి మధ్య ఘర్షణ చెలరేగడం, బిగ్ బాస్ స్క్రిప్ట్ ఆ అనే అనుమానాన్ని కూడా ప్రేక్షకుల్లో కలిగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories