Bigg Boss : బిగ్ బాస్‌లో ప్రేరణ, హారిక, మానస్ సందడి..హౌస్‌మేట్స్‌కు మోటివేషన్!

Bigg Boss : బిగ్ బాస్‌లో ప్రేరణ, హారిక, మానస్ సందడి..హౌస్‌మేట్స్‌కు మోటివేషన్!
x

Bigg Boss : బిగ్ బాస్‌లో ప్రేరణ, హారిక, మానస్ సందడి..హౌస్‌మేట్స్‌కు మోటివేషన్!

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో హౌస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఎక్స్-కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు. 79వ రోజు రాత్రి ప్రేరణ కంబం హౌస్‌లోకి అడుగుపెట్టింది.

Bigg Boss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో హౌస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఎక్స్-కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు. 79వ రోజు రాత్రి ప్రేరణ కంబం హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమె హౌస్‌మేట్స్‌కు ఇల్లంతా చూపిస్తూ, ముఖ్యంగా టాప్ 5లో ఉంటే బిగ్ బాస్ ఇచ్చే గౌరవం గురించి చెబుతూ, గట్టిగా ఆడాలని మోటివేట్ చేసింది. ప్రేరణ, తనూజ మధ్య జరిగిన క్రాస్ ఇట్ క్లైమ్బ్ ఇట్ రోప్ ఇట్ టాస్క్‌లో ప్రేరణ గెలిచింది. 80వ రోజు ఉదయం సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్ దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చి నవ్వులు పూయించింది. ఆమె ఇమ్మూతో ఫన్నీ స్కిట్స్ చేయించడమే కాక, సుమన్ శెట్టితో టవర్ ఆఫ్ పవర్ టాస్క్ ఆడి గెలిచింది. టాస్క్ తర్వాత సరదాగా ఇమ్మూని స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి వెళ్లిపోయింది.

సాయంత్రం వేళ మానస్ హౌస్‌లోకి వచ్చి ఫుల్ జోష్ నింపాడు. హౌస్‌లో వైబ్ లేకపోవడంతో, బిగ్ బాస్‌ను అడిగి మరీ కుర్చీని మడతబెట్టి సాంగ్ వేయించుకుని డ్యాన్స్ చేశాడు. నామినేషన్ల గురించి మాట్లాడుతూ, బలమైన పాయింట్స్ ఉంటేనే నామినేట్ చేయాలని హౌస్‌మేట్స్‌కు మంచి సలహా ఇచ్చాడు. ఆ తర్వాత డెమోన్‌తో నెయిల్ ఇట్ టు విన్ ఇట్ టాస్క్ ఆడగా, అందులో డెమోన్ గెలిచి సెకండ్ కంటెండర్‌గా నిలిచాడు. ఈ విధంగా ఎక్స్-కంటెస్టెంట్స్ రాక హౌస్‌మేట్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

హౌస్‌లో ఎంటర్టైన్‌మెంట్ ఉన్నా, గొడవలకు మాత్రం కొదవ లేదు. 80వ రోజు ఉదయం భరణి, దివ్య మధ్య మళ్లీ డిస్కషన్ మొదలైంది. భరణి, దివ్యను ఏజ్ గురించి పదే పదే ఎందుకు మాట్లాడతావు? దేనికైనా హద్దు ఉంటుంది అని ఫైర్ అయ్యాడు. నువ్వు జోక్ వేసినప్పుడు నేను తీసుకున్నా, నేను వేస్తే నువ్వు తీసుకోవాలి అని దివ్య పట్టుబట్టింది. దాంతో భరణి నాదే తప్పు, సారీ, ఇంకెప్పుడూ రిపీట్ చేయను అని వినయంగా చెప్పినా, దివ్య శాంతించలేదు. చివరకు భరణి చిన్నోళ్లకైనా, పెద్దోళ్లకైనా సారీ ఇలాగే చెప్తారు, తీసుకో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ గొడవకు తెరపడింది.

గత వారం నో ఎలిమినేషన్ తో బిగ్ బాస్ 9 మరింత ఉత్కంఠగా మారింది. ఈ వారం రెండు దశల్లో నామినేషన్స్ జరిగాయి. కెప్టెన్ రీతూ మినహా మొత్తం 8 మంది (తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, దివ్య నిఖితా) నామినేట్ అయ్యారు. ఓటింగ్ ట్రెండ్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ పడాలా (30.07%) అనూహ్యంగా అగ్రస్థానంలో ఉండగా, తనూజ (28.23%) రెండో స్థానంలో ఉంది. ఈ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. మిగిలిన కంటెస్టెంట్లలో ఇమ్మానుయేల్, సంజన, భరణి సురక్షితంగా ఉన్నా, డీమాన్ పవన్ (5.94%), సుమన్ శెట్టి (5.93%), దివ్య నిఖితా (5.8%) ఓట్లతో బాటమ్ 3లో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే దివ్య నిఖితా ఎలిమినేషన్ అంచున ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఓటింగ్ ముగిసే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం!

Show Full Article
Print Article
Next Story
More Stories