Biggboss : బిగ్ బాస్ 9 రణరంగం 2.O సిద్ధం.. ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌తో షోకి కొత్త ఊపు

Biggboss : బిగ్ బాస్ 9 రణరంగం 2.O సిద్ధం.. ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌తో షోకి కొత్త ఊపు
x

Biggboss : బిగ్ బాస్ 9 రణరంగం 2.O సిద్ధం.. ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌తో షోకి కొత్త ఊపు

Highlights

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ప్రస్తుతం ఆట కాస్త డల్‌గా, రొటీన్‌గా సాగుతోంది. పవన్, కళ్యాణ్ పడాల లాంటి కొందరు కంటెస్టెంట్ల ప్రవర్తన విమర్శలకు తావిస్తుంటే, మరికొందరు నామమాత్రంగానే కనిపిస్తున్నారు.

Biggboss : బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ప్రస్తుతం ఆట కాస్త డల్‌గా, రొటీన్‌గా సాగుతోంది. పవన్, కళ్యాణ్ పడాల లాంటి కొందరు కంటెస్టెంట్ల ప్రవర్తన విమర్శలకు తావిస్తుంటే, మరికొందరు నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఈ డల్ వాతావరణాన్ని మార్చి, ప్రేక్షకులకు అసలైన మజా ఇవ్వడానికి బిగ్ బాస్ టీమ్ రంగంలోకి దిగింది. అందుకే, ఏకంగా ఆరుగురు ఖతర్నాక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపించడానికి సిద్ధమైంది. వీరు శనివారమే హౌస్‌లోకి అడుగుపెట్టినా, వీరి గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్‌ను గత సీజన్‌ల మాదిరిగా బిగ్ బాస్ 2.O గ్రాండ్ లాంచ్ పేరుతో వచ్చే ఆదివారం (అక్టోబర్ 13) నాడు ప్రసారం చేయనున్నారు. ఈ కొత్త ఎంట్రీలతో బిగ్ బాస్ సీజన్ 9కి కొత్త ఊపు రావడం, అసలైన రణరంగం మొదలవడం ఖాయం. కొత్త, పాత కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ మొదలయ్యే అవకాశం ఉంది.

తాజాగా బయటికొచ్చిన సమాచారం ప్రకారం, బిగ్ బాస్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి వెళ్లబోతున్న ఆరుగురు ప్రముఖులు అయేషా జీనత్, అలేఖ్య చిట్టి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్త, దివ్వెల మాధురి, శ్రీనివాస సాయి.

అయేషా జీనత్ : వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పరిగణించబడుతోంది. తమిళ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని 9 వారాలు ఉన్న అనుభవం ఈమె సొంతం. అక్కడ వివాదాస్పద కంటెస్టెంట్‌గా నిలిచిన ఈమె, హోస్ట్‌పైనే వేలెత్తి చూపింది. తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్‌తో పాటు పలు షోల్లో కనిపించింది. బిగ్ బాస్ ఫార్మాట్‌పై అవగాహన ఉండటం, ఫైరింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉండటంతో ఈమె హౌస్‌లో వైల్డ్ ఫైర్ చూపించే అవకాశాలు ఎక్కువ.

అలేఖ్య చిట్టి : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రమ్య ఎంట్రీ కోసం బిగ్ బాస్ టీమ్ సరైన సమయం కోసం వేచి చూసింది. ఐదు వారాల ఆటను పరిశీలించాక రమ్యను పంపిస్తున్నారంటే, ఈమె ద్వారా హౌస్‌లో గట్టి రచ్చ సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి. మంచి గ్లామర్ ఉన్న రమ్య ఎంట్రీతో పవన్, కళ్యాణ్ లాంటి కంటెస్టెంట్స్‌కి ఫుల్ కంటెంట్ దొరకొచ్చు. ఈమె తన కోసి కారం పెడతా అనే వివాదంతో బాగా పాపులర్ అయింది.

నిఖిల్ నాయర్ : గృహలక్ష్మి సీరియల్‌లో ప్రేమ్‌గా, పలుకే బంగారమాయెనా సీరియల్ హీరోగా మెప్పించిన నిఖిల్ నాయర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో ఉన్న ఇతను హౌస్‌లోకి వెళ్తే ఫిజికల్ టాస్క్‌లలో బలమైన పోటీదారుగా నిలుస్తాడు. ఇతని కటౌట్‌కు తగ్గట్టుగా గేమ్ ఆడితే, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారే అవకాశం ఉంది.

గౌరవ్ గుప్త : ప్రస్తుతం గీత LLB సీరియల్‌లో నటిస్తున్న గౌరవ్ గుప్తా కూడా మంచి ఫిజిక్‌తో ఉంటాడు. ఇతను ఫిజికల్ టాస్క్‌లలోనే కాకుండా, హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌తో కూడా మంచి కంటెంట్‌ను అందించగలడని బిగ్ బాస్ భావిస్తోంది.

శ్రీనివాస సాయి : గోల్కొండ హైస్కూల్' సినిమాలో బాల నటుడిగా నటించి, ఆ తర్వాత శుభలేఖలు వంటి సినిమాల్లో హీరోగా చేసిన శ్రీనివాస సాయిని బిగ్ బాస్ టీమ్ ప్రత్యేకంగా ఎంపిక చేసింది. ఫిజిక్‌తో బాగా ఉన్న ఇతను హౌస్‌లోకి వెళ్లాక ఎలాంటి ట్రాక్ పడుతుందో చూడాలి.

దివ్వెల మాధురి : ఈ ఆరుగురి జాబితాలో దివ్వెల మాధురి ఎంట్రీపైనే అనుమానం నెలకొంది. ఆమె గతంలో బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఆమె తన ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి వ్యాపారం మొదలుపెట్టడం, అతన్ని విడిచి ఉండలేనని చెప్పడం వంటి కారణాల వల్ల ఆమె హౌస్‌లోకి వెళ్లడం అనుమానమే.

బిగ్ బాస్ 2.O ఎపిసోడ్ ప్రసారం ఎప్పుడు?

ఈ ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ ఆదివారం నాడు బిగ్ బాస్ 2.O పేరుతో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 12 మంది కంటెస్టెంట్స్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని, ఆ వెంటనే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ కొత్త కంటెస్టెంట్స్ రాకతో షో మరింత ఉత్సాహంగా మారడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories